మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. కోలీవుడ్ సీనియర్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఏకంగా రు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికీ పలుసార్లు వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. రామ్ చరణ్ కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కీరా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరై సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చారు. అయితే ఇటీవల టాలీవుడ్ లో సినిమాలుకు రాజకీయ రంగు పూలముకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో వైసిపి వాళ్లు గేమ్ ఛేంజర్ టార్గెట్గా విష ప్రచారం మొదలుపెట్టేశారు. వైయస్ జగన్ అనుకూల సోషల్ మీడియా పేజీలలో ... గేమ్ ఛేంజర్ అట్టర్ ప్లాప్ అంటూ ప్రచారం నడిపిస్తున్నారు. తమిళనాడులో ఈ సినిమా షో వేస్తే అక్కడ డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఫస్ట్ అఫ్ చూసి వెళ్లిపోయారని .. సినిమాపై వాళ్లకు ఆశలు లేవని అందుకే దిల్ రాజు తమిళనాడు - కర్ణాటక - కేరళతో పాటు నైజాం ఇటు ఉత్తరాంధ్ర లో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆదివారం మొత్తం వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్ అనుకూల ఫేస్బుక్ పేజీలతో పాటు సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టార్గెట్గా విష ప్రచారం అయితే నడుస్తోంది. ఏది ఏమైనా ఈ తరహా ప్రచారాలు అటు ఇండస్ట్రీకి ... ఇటు జగన్‌కు కూడా మంచివి కావు. ఇలాంటి వాటికి పులిస్టాప్ పెడితే మంచిదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.