కాగా బాలకృష్ణ సినిమాలకు ఎంతోమంది సంగీతాన్ని అందించారు. కానీ అందరికన్నా ఎక్కువగా థమన్ అంటే బాలకృష్ణకు చాలా ఇష్టమట. బాలయ్య మనసులో థమన్ కి మొదటి స్థానం ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ బాలయ్య బాబుకు మంచి పాటలు ఇచ్చారు. అయితే ఓ సినిమా సమయంలో దేవిశ్రీ, బోయపాటి శ్రీను మధ్య చిన్న సంభాషణ జరిగిందట. అప్పటినుంచి బాలయ్య సినిమాలకు దేవి శ్రీని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోలేదు.
అప్పటినుంచి బోయపాటి శ్రీను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నీ లైన్ లోకి తీసుకోవచ్చారు. అప్పటినుంచి బోయపాటి సినిమాలకు థమన్ మాత్రమే సంగీతాన్ని ఇస్తున్నారు. బాలయ్య తాజా చిత్రం డాకు మహారాజ్ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించారు. త్వరలో ప్రారంభం కానున్న అఖండ-2 సినిమాకు థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నారు. అంతకుముందు రిలీజ్ అయిన భగవంత్ కేసరి, అఖండ, వీరసింహారెడ్డి సినిమాలకు థమన్ సంగీతాన్ని సమకూర్చారు.
అవన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు భారీగా కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. దీంతో థమన్ సంగీతం బాలయ్య ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. అందుకే బాలయ్య లైక్ తమన్ అయ్యారు. ముందు ముందు వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం థమన్ అఖండ-2 సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. అఖండ-2 సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారట.