టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇలా దేశముదురు లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు... దగ్గరయింది హన్సిక. ఈ అందాల తార... హన్సిక అది తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో పాపులర్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అలాంటి అందాల తార హన్సికకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. ఆమెపై గృహహింస కేసు పెట్టారు. ఆ కేసు పెట్టింది ఎవరో కాదు హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య.


టాలీవుడ్ హీరోయిన్ అందాల తార హన్సిక సోదరుడు ప్రశాంత్ కుటుంబం బాధలు భరించలేక... తాజాగా గృహ హింస కేసు పెట్టారు అతని భార్య ముస్కాన్. ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ హన్సిక పైన ఈ కేసు పెట్టారు ముస్కాన్. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. హన్సికతో పాటు ఆమె కుటుంబం మొత్తం పైన కూడా ముస్కాన్ కేసు పెట్టడం జరిగింది. హన్సిక సోదరుడు ప్రశాంత్ అలాగే ముస్కాన్ ప్రేమించి.. లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది.


ప్రశాంత్ అలాగే ముస్కాన్ ఇద్దరి వివాహం 2021 సంవత్సరంలో జరిగింది. అయితే... పెళ్లయిన నాలుగు నెలల నుంచి ముస్కాన్ అలాగే ప్రశాంత్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇంకేముంది సెలబ్రిటీలకు అలవాటే కదా... ఇద్దరు విడివిడిగా కూడా ఉంటున్నారట. ఈతరణంలోనే డిసెంబర్ 18వ తేదీ న గృహహింస కేసు పెట్టిందట ముస్కాన్. ముంబైలోని అంబులి పోలీస్ స్టేషన్‌ లో ఈ కేసు పెట్టడం జరిగిందని సమాచారం.


అయితే ఈ కేసు వివరాలు చాలా ఆలస్యంగా బయటికి వచ్చాయి. తన అత్తమామలతో పాటు తన భర్త ప్రశాంత్ సోదరి హీరోయిన్ హన్సిక... తమ లైఫ్ లో గొడవలు సృష్టిస్తున్నారని.. గృహహింస కేసు పెట్టింది. అంతేకాదు తనకు డబ్బు అలాగే ఖరీదైన బహుమతులు కావాలని గత కొన్ని రోజులుగా హన్సిక వేధిస్తున్నట్లు ముస్కాన్... ఫిర్యాదులో  పేర్కొన్నారు.  ఆమె కారణంగా తమ లైఫ్ రోడ్డుపోయిన పడిందని కూడా వెల్లడించారు. మరి ఈ కేసు పై హన్సిక ఎలా స్పందిస్తుందో చూడాలి. అటు ఈ కేసు పై.. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: