ఇలాంటి పరిస్థితుల మధ్య హీరోయిన్ త్రిష తనకు ఎప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రి కావాలి అన్నది తన కళ అంటూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. హీరోయిన్స్ రాజకీయాలలోకి రావడం కొత్తవిషయం కాదు. విజయశాంతి రోజా ఖుష్బూ హేమమాలిని జయప్రద జయసుధ లాంటి అనేకమంది హీరోయిన్స్ రాజకీయాలలోకి వచ్చి ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారిలో ఒక్క జయలలిత తప్ప మరెవ్వరూ రాజకీయాలలో రాణించలేకపోయారు.
తమిళనాడు ప్రజల హృదయాలలో ఇప్పటికీ జయలలిత ఇప్పటికీ తమిళ ప్రజలలో ‘అమ్మ’ గా జనం జ్ఞాపకల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ టాప్ హీరోయిన్ గా ఆమెకు గుర్తింపు ఉంది కానీ తమిళ ప్రజల హృదయాలలో ఎటువంటి స్థానం లేదు అన్నది ఓపెన్ సీక్రెట్. దీనికితోడు ఆమె సామాజిక పరంగా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలేదు.
దీనితో ఆమె ముఖ్యమంత్రి కల ఎలా నెరవేరుతుంది అంటూ విజయ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం త్రిష వయస్సు 40 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ టాప్ హీరోయిన్ గా ఆమె ఒక వెలుగు వెలుగుతోంది. ఆస్థాయిని దృష్టిలో పెట్టుకుని త్రిష ఇలాంటి కలలు కంటోంది అనుకోవాలి. అయితే ఇప్పటికే తమిళ టాప్ హీరో విజయ్ రాజకీయాలలో తన వేగం పెంచిన నేపధ్యంలో త్రిషను ఎవరు పట్టించుకుంటారు అన్నది సమాధానం లేని ప్రశ్న..