జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ వీళ్ళిద్దరికీ ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అంతేకాదు ఇద్దరూ కూడా మంచి జాన్ జిగిడి దోస్తులు . ఒకరి కోసం ఒకరు కూడా కొన్ని సినిమాలు కూడా శాక్రిఫైజ్ చేశారు. ఒకరి సినిమాల ప్రమోషన్స్ కి మరొకరు వస్తు సపోర్ట్ చేస్తూ లైఫ్ ని చక్కగా ముందుకు తీసుకెళుతున్నారు.  అయితే వీళ్ళ ఇద్దరికీ ఉన్న ఒక కామన్ పాయింట్ ఇప్పుడు జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు స్టార్స్ ..ఇద్దరు పాన్ ఇండియా హీరోలే ..ఇద్దరు కూడా 100 కోట్లు తీసుకుంటున్నారు . అయితే ఇద్దరు కూడా పాలిటిక్స్ అంటే అస్సలు పడదు . ఫ్యామిలీ పరంగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సరే జూనియర్ ఎన్టీఆర్ కి.. ప్రభాస్ కి పాలిటిక్స్ అంటే చెడ్డ చిరాకు.

మొదటి నుంచి సొసైటీలో పాలిటిక్స్ పై ఉన్న ఇంప్రెషన్ నో..? లేకపోతే ఫస్ట్ నుంచి వాళ్లకి అసలు పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేదో..? రీజన్ ఏంటో తెలియదు కానీ చాలా సార్లు పాలిటిక్స్ పరంగా చిక్కులు ఎదుర్కొన్నారు. పలు సందర్భాలలో పాలిటిక్స్ లోకి వస్తారా..? అన్న క్వశ్చన్ పై కూడా నిర్మొహమాటంగా నో అంటూ ఆన్సర్ కూడా ఇచ్చారు . బిజెపి పరంగా కృష్ణంరాజు.. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు టిడిపి పార్టీని స్థాపించిన మ్యాటర్ అందరికీ తెలుసు .

అయితే "జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి .. పాలిటిక్స్ లోకి రావాలి అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆశపడుతుంటే . మరి కొందరు మాత్రం అలాంటి పని చేయద్దురా సామి.. మీ లైఫ్ మీది సినిమాలనే  ఎంజాయ్ చేయండి "అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . కానీ ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఎప్పటికీ పాలిటిక్స్ లోకి మాత్రం రానే రారు అంటూ మరీ చెబుతున్నారు. అంతేకాదు ఇప్పుడు అందరి కళ్ళు రాంచరణ్ పై పడ్డాయి . బాబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉండడంతో రాంచరణ్ ఏమన్నా ఫ్యూచర్లో పాలిటిక్స్ లోకి వస్తారా..? అనే విధంగా చర్చించుకుంటున్నారు.  ఒకానొక సినిమా ఈవెంట్లో కేటీఆర్ సైతం " నీ స్పీచ్ భలే ఉంది ..నీ స్పీచ్ అందరిని ఆకట్టుకుంటుంది .. ఫ్యూచర్లో మాకు కాంపిటీషన్ రావు కదా..?" అంటూ చిరంజీవి పక్కన ఉండగానే పొలిటికల్ ఎంట్రీ పై మాట్లాడారు.  అయితే చిరంజీవి మాత్రం "వాడు చిన్న పిల్లోడు అని మాట్లాడాడు .. రామ్ చరణ్ అయితే ఏకంగా చేతులెత్తి దండం పెట్టేసాడు" అంటే రామ్ చరణ్ కి కూడా పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: