తెలుగులో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇండియాలో మాత్రమే కాకుండా ఈ సినిమా చైనాలో కూడా బ్లాక్ బస్టర్ రికార్డులను సొంతం చేసుకుంది. చైనాలో ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. మహారాజా సినిమా చైనాలో ఇప్పటివరకు రూ. 91.55 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుని 100 కోట్ల మైల్ స్టోన్ మార్క్ దిశగా వెళుతోంది.
గడిచిన ఐదేళ్లలో చైనా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా మహారాజా సినిమా నిలిచింది. ఈ విషయాన్ని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ వేదికగా తెలియజేశాడు. ఇక తూర్పు లడక్ లో ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన ముగిసిన అనంతరం చైనాలో రిలీజ్ అయిన మొదటి భారతీయ సినిమా మహారాజా కావడం విశేషం.
కాగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా చైనాలో రూ. 80 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక తాజాగా మహారాజా సినిమా ఈ రికార్డులను క్రాస్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా చైనాలో 50 కోట్లు వసూలు చేయగా, ఆర్ఆర్ఆర్ సినిమా 40 కోట్ల వరకు కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాలతో చూస్తే మహారాజా సినిమాకి చైనాలో మంచి ఆదరణ లభించింది. ఇది త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.