జూనియర్ ఎన్టీఆర్ చాలా మొండోడు అన్న విషయం మనందరికీ తెలుసు . అది తప్పైనా..? ఒప్పైన..? తాను తీసుకున్న డెసిషన్ కే కమిటీ అయి ఉంటాడు . ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది అని తారక్ కమిట్ అయ్యాక..అది ఫ్లాప్ అని తెలిస్తే ఎవరు చెప్పిన సరే ఆ సినిమా నుంచి మాత్రం బయటకు రాడు. కోట్లు నష్టం వచ్చిన సరే కమిట్ అయిన సినిమాని కమిటెడ్ గా చేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భాలు కూడా చాలానే చూశాం. ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే దేవర 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఆ తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాని కూడా ఆల్టర్నేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు .
అయితే ఇలాంటి మూమెంట్లోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది . జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ కలవాడు . జూనియర్ ఎన్టీఆర్ - ప్రభాస్ ల మధ్య బాండింగ్ ఎంత ఫీల్ గుడ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే . అయితే అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించమంటే రిజెక్ట్ చేసాడట . ఈ విషయం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కోసం చాలా చాలా సినిమాలనే వదులుకున్నాడు. అలాంటి ఆయన ఎందుకు ఆ సినిమాలో నటించలేకపోయాడు ..? అనేది ఇప్పుడు వైరల్ గా మారింది .
కాగా ప్రభాస్ నటించిన "బుజ్జిగాడు" సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం అడిగారట పూరి జగన్నాథ్ . ప్రభాస్ కూడా అందుకు ఇష్టపడ్డారట . కానీ జూనియర్ ఎన్టీఆర్ కి వేరే సినిమాలో గెస్ట్ పాత్రలో నటించడం అస్సలు ఇష్టం లేదట. అది కూడా తన క్యారెక్టర్ కి వాల్యూ లేకపోతే అసలు చేయడట. తన సినిమాలో తనకు క్యారెక్టర్ లేకపోతేనే చేయడు ..మరి పక్క సినిమాలో క్యారెక్టర్ లేకుండా ఎందుకు గెస్ట్ రోల్ చేస్తాడు..? అలాంటి జూనియర్ ఎన్టీఆర్ వెంటనే పూరి జగన్నాథ్ తో ఉన్న చనువుతో .."ఏయ్ వాడి సినిమాలో నేను చేయాలా..? నా సినిమా అది.. నా సినిమాలోనే వాడు చేయాలి" అంటూ సరదాగా నవ్వుతూ ఆ క్యారెక్టర్ రిజెక్ట్ చేశారట . పూరి జగన్నాథ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ రోల్ ని రిజెక్ట్ చేయడంతో ఏమాత్రం బాధపడలేదట . ఎందుకంటే పూరి జగన్నాథ్ కి ముందే అర్థమైపోయిందట. ఇలాంటి క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ చేయడు అంటూ తారక్ రిజెక్ట్ చేస్తాడు అన్న విషయాన్ని ముందుగానే గెస్ చేసాడట . "బుజ్జిగాడు" సినిమా ప్రభాస్ కెరియర్ లో స్పెషల్ ఇమేజ్ ని తీసుకొచ్చింది..!