గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ట్రైలర్లు విడుదలయ్యాయి. ట్రైలర్ల రిలీజ్ కు ముందు సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ పరిస్థితి మారింది. గెమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాల ట్రైలర్లు ఆకట్టుకున్న స్థాయిలో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఆకట్టుకోలేదు.
 ట్రైలర్ లో అనిల్ రావిపూడి మార్క్ చమక్కులు కూడా ఎక్కువగా లేవు.
 
ఒకింత అంచనాలు తగ్గించే విధంగా ఈ ట్రైలర్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం నాలుగు రోజుల్లో జరిగే సినిమా అని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చింది. భగవంత్ కేసరి సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న మేకర్స్ ఆ సినిమాతో విజయం అందుకోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.
 
వెంకటేశ్ గత సినిమా సైంధవ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. వెంకటేశ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది. వెంకటేశ్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
 
ఒక విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేశ్ మార్కెట్ ను డిసైడ్ చేసే మూవీ అవుతుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా టాలీవుడ్ రేంజ్ ను పెంచుతుందేమో చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత బిజీ అవుతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 27 నుంచి 28 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: