ప్రజెంట్ టాలీవుడ్ మోస్ట్ పాపులర్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్గా పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయ అందుకున్న విషయం తెలిసిందే .. 2024 ను సూపర్ హిట్ తో ముగించింది .. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబోతున్నయి అంతే కాకుండా బాహుబలి 2 రికార్డులను తిరగరాసి మైత్రీకి భారీ లాభాలు  అందించింది. ఇదే సమయంలో తమ బ్యానర్ పై వస్తున్న అప్ క‌మింగ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు మైత్రి అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ య‌లమంచిలి.. 2025 లో పలు భారీ సినిమాలతో ప్రేక్షకులు= ముందుకు వచ్చేందుకు రెడీ  అవుతున్నారు .. బాక్స్ ఆఫీస్ దగ్గర మరిన్ని విజయాలు అందుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.


ఇదే క్రమంలో వచ్చే 2026 కోసం ఇప్పటినుంచి ప్లానింగ్ చేస్తున్నారు .. ఇక 2026 ను ఫెస్టివల్ స్పెషల్ గా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్‌ను తీసుకువచ్చేందుకు రెడీ చేస్తున్నారు .. ఈ ఏడాదిని పాన్ ఇండియా హీరో సినిమాతో మొదలుపెట్టి మరో పెద్ద హీరో మూవీతో గ్రాండ్గా ముగించాలని చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. అయితే మైత్రి లైన్ అప్ లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా 2026 సంక్రాంతి కనుక జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ ఇప్పటికే ఇచ్చేశారు. ఇక జనవరి చివరలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొద‌లు కానుంది .. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో అడుగుపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది.


ప్రజెంట్ వార్ 2 షూటింగ్ను పూర్తి చేస్తున్న  ఎన్టీఆర్ ఆ తర్వాత నీల్ తెర‌క్కెకించే మాస్ ఎంటర్టైనర్ షూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వన్నారట .. ఇక మరో పక్క సీతారామం దర్శకుడు హ‌నురాఘ‌పూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఒకవేళ అన్ని కుదిరితే ఈ సంవత్సరం దస‌ర‌కు కు విడుదల చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పీరియాటిక్ యాక్షన్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది .. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే టైం లో ఈ మూవీ సాగుతున్నట్లు తెలిసింది ప్రభాస్ ఓ సైనికుడుగా కనిపించనున్నారట ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి 2026లో మైత్రీ ప్లాన్ ఎంతటి సక్సెస్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: