అదేంటి పుష్ప2 సినిమా ఇప్పటివరకు రూ.1800 కోట్ల వరకు వసూలు చేసిందని నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటిస్తే, ప్లాప్ అంటున్నారేంటి? అని అనుమానం పడుతున్నారా? అవును.. మీరు విన్నది నిజమేనండి. ఐకాన్ బాబు అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇంతవరకు రూ.1800 కోట్లు రాబట్టినప్పటికీ ఇతర ప్రాంతాల్లో ఇంతవరకు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేదని మార్కెట్ వర్గాలు వాపోతున్నాయి. అయితే దానికి కారణం లేకపోలేదు. సినిమాను భారీ ధరలకు నిర్మాతలు అమ్మడమే ఇందుకు నిదర్శనం.

పుష్ప1 లాగా తెలుగులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ధరలు అధికంగా ఉండటంతో తెలుగు సినిమా ప్రేక్షకులు 60 శాతం మందికి పైగా అనుకున్న స్థాయిలో థియేటర్లకు రాలేదని వినికిడి. ఈ నేపథ్యంలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఫ్లాప్ అవడం ఏమిటని బన్నీ అభిమానులు అవాక్కవుతున్నారు. బాలీవుడ్ మినహా మిగతా ప్రాంతాల్లో... రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం ప్రాంతం మినహా, ఏ ప్రాంతంలోను ఈ సినిమాకు ఇంకా డబ్బులు చేయలేదని సమాచారం. సీడెడ్, కృష్ణా-గుంటూరు, ఉత్తరాంధ్ర, నెల్లూరు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదని తెలుస్తోంది.

పుష్ప1 కూడా ఏపీలో చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోతే బయ్యర్లకు నిర్మాతలు డబ్బులు వెనక్కిచ్చిన సంగతి విదితమే. ఈసారి కూడా అదే జరుగుతుందా? అనే సందేహం ఉండనే ఉంది. అయితే ఈసారి కర్ణాటకలో మాత్రం మంచి వసూళ్లు రాబట్టడం గమనార్హం. హిందీ గురించి అయితే ఇక చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచి త్వరలోనే రూ.వెయ్యి కోట్ల క్లబ్బులో చేరనుంది. మంచి టాక్ తెచ్చుకున్న ఉత్తర అమెరికాలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఒకింత బాధాకరం. మొత్తంగా చూస్తే ఒక్క బాలీవుడ్ మినహా ఈ సినిమాకు అన్నిచోట్లా నష్టాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు. మార్కెట్ సామర్థ్యానికి మించి.. బన్నీకి మంచి క్రేజ్ ఉన్న కేరళలో కూడా సినిమా ఫ్లాపైంది. ఇక తమిళనాడులో అయితే సినిమాని అస్సలు చూడనేలేదు. ఇక పొంగల్ కు గేమ్ ఛేంజర్ తోపాటు మరో ఆరు సినిమాలు అక్కడ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నష్టపోయినవారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నార్థకంగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: