సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి జనాలకు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే గత నెల రోజులుగా ఈ కేసు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వింటూనే ఉన్నాం. అల్లు బాబు నటించిన పుష్ప 2 సినిమా ప్రివ్యూ షోస్ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఇప్పటికీ ఆ కేసు కోర్టు పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును, తొక్కిసలాట ఘటన కేసులో సంధ్య థియేటర్ ఓనర్లకు భారీ ఊరట లభించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓనర్లు చిన్నరామిరెడ్డి, పెద్దరామిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఈ నేపథ్యంలో 2 షూరిటీలు, రూ.25 వేలు పూచీకత్తుగా సమర్పించాలని పేర్కొంది. కాగా ఇదే కేసులో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైన సంగతి కూడా తెలిసిందే.
ఇకపోతే, డిసెంబర్ 04 పుష్ప-2 ప్రీమియర్స్ షో ప్రదర్శన సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ లోకి రావడంతో తొక్కిసలాట జరగడం, రేవతి అనే మహిళా మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. మధ్యంతర బెయిల్ రావడం చక చకా జరిగిపోయాయి.