అయితే కేసు కోర్టులో ఉన్న కారణంగా బన్నీ బాలుడిని కలవలేకపోయానని ఓ మీడియా సమావేశంలో చెప్పారు. త్వరలోనే వెళ్లి బాలుడిని పరామర్శిస్తానని అన్నారు. ఇటీవల కోర్టులో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. ఇదిలా ఉంటే గత నెల నాలుగవ తేదీన సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో వేసిన సమయంలో రేవతి ఆమె భర్త మరియు కుమారుడితో సినిమా చూసేందుకు వచ్చింది.
అక్కడకు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒకసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలో రేవతి కింద పడిపోగా తొక్కిసలాటలో మరణించింది. ఆమెతో పాటు ఆమె కుమారుడు శ్రీ తేజ్ కూడా కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్పించగా కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయగా అదే రోజు రాత్రి బెయిల్ పై బయటకు వచ్చారు. బాధిత కుటుంబానికి ఇప్పటికే మూడు కోట్ల వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. రాజకీయంగానూ ఈ ఘటన దుమారం రేపడంతో పాటూ అసెంబ్లీలోనూ ఘటనపై చర్చించారు.