గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అబవ్ యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైతే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. దేవర హిందీ కలెక్షన్లను గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
 
దేవర సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించడం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమాకు 70 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ మరీ భారీ టార్గెట్ అయితే కాదని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమాలో క్రేజీ ట్విస్టులు ఉంటాయని తెలుస్తోంది. అంజలి రోల్ ఈ సినిమాకు హైలెట్ కానుందని అంజలి పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది.
 
గేమ్ ఛేంజర్ సినిమాలోని 5 పాటల కోసమే 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మేకర్స్ చెబుతున్నారు. తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపు దక్కితే మాత్రం గేమ్ ఛేంజర్ మూవీకి మరింత ప్లస్ అవుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. బెంగళూరులో ఉదయం 6 గంటల నుంచి ఈ సినిమా షోలు ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది.
 
గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్ విషయంలో చిరంజీవి సైతం పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం. ఈ సినిమా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ కావడం శంకర్ కు కూడా కీలకమని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ కు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: