ప్రముఖ టాలీవుడ్ సినిమా నిర్మాత దిల్ రాజు గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు అలియాస్ "వెలమకూర్చ వెంకట రమణ రెడ్డి" తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి, టాలీవుడ్లో తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్నాడు. ఆయన మొదట్లో నిర్మించిన దిల్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక అక్కడి నుండి ఆయన ఇంటిపేరు కూడా దిల్ అయిపోయి.. దిల్ రాజుగా పేరుగాంచారు. ఇక తాజాగా దిల్ రాజు తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సినిమాలపై తనకు ఇష్టం ఎలా ఏర్పడిందో చెప్పుకొచ్చాడు.

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ట్రైలర్ ఈవెంట్‌ను సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో వేడుకగా నిర్వహించగా... ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేయడం జరిగింది. ఈ వేదికపై హీరో వెంకటేశ్ డ్యాన్స్‌‌తో సందడి చేసి అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం విశేషం. దిల్ రాజు మాట్లాడుతూ... "నిజామాబాద్ అంటే నా చిన్ననాటికి నేను వెళ్ళిపోతాను. 1980 దశకంలో ఇక్కడ విజయ్ థియేటర్, పిక్చర్ ప్యాలెస్, లలితా మహాల్, నటరాజ్ థియేటర్, రాజరాజేంద్ర థియేటర్లలో రూపాయి చారనా టికెట్‌‌లో సైకిల్ మీద వెళ్లి నేను, శిరిశ్ సినిమాలు చూసే వాళ్లం. అలా సినిమాలపై మాకు ఇష్టం ఏర్పడింది. సినిమా ఫీల్డ్‌‌కు వస్తామని కూడా తెలియదు కానీ, సినిమాలపై ఇష్టంతో వచ్చిన ప్రతి సినిమా చూసేవాళ్లం" అని చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... అలా తొలినాళ్లలో ఆయన "మనవూరి పాండవులు" సినిమా చూశానని, అప్పటి నుండి హీరో వెంకటేష్ తన అభిమాన హీరో అయిపోయాడని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఆ తరువాత కాలంలో హీరో నాగార్జున సినిమాలు ఎక్కువ చూసేవాడినని, నాగార్జున అంటే ఎంతో ఇష్టమని.. అలా ఈ ఇద్దరి హీరోలు తన ఫెవరెట్ హీరోలు అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తరువాత కాలంలో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి అతనికి కూడా ఫ్యాన్ అయిపోయానని చెప్పుకొచ్చాడు. అలా అప్పటినుండీ సినిమాలు చూస్తూ ఎదుగుతూ అదే నిజామాబాద్‌‌లో తమ 58వ సినిమా ఈవెంట్స్ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ క్రమంలో చాలా మంది దర్శకులు, ఎంతో మంది హీరోలు ఎంతో సపోర్టు చేయడం వల్లే తాము ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉన్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: