ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫిబ్రవరి .. మార్చ్ లో భారీ ఎత్తున ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. గత ఐదేళ్లలో స్థానిక సంస్థలతో పాటు .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు అన్ని దాదాపు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇప్పుడు అయితే వైసిపి ఓడిపోయిందో ఆ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్సీలు బయటకు వచ్చేస్తున్నారు. కొందరు తమ పదవులకు రాజీనామాలు చేసి మరి వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే ఫిబ్రవరి - మార్చ్ లో భారీగా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. కూటమి లోనూ మూడు పార్టీలకు చెందిన నేతలకు పదవులు దక్కనున్నాయి. ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది.. ఇది ఇలా ఉంటే ఓ నలుగురు టాప్ లీడర్లకు చంద్రబాబు ఇప్పటికే ఎమ్మెల్సీ సీట్లు కన్ఫామ్ చేసినట్టు కూటమి వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఆ నలుగురు ఎవరో కాదు ? జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు .. ఇటు టిడిపి నుంచి విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా .. మైలవరం మాజీ ఎమ్మెల్యే .. మాజీ మంత్రి దేవినేని ఉమా తో పాటు విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్లు రేసులో ఉన్నాయి.
వీరిలో నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సిఫార్సులు మేరకు ఆయన క్యాబినెట్ లోకి రావడం ఖరారు అయింది. ఆయన ఎమ్మెల్యే కాదు .. ఈ క్రమంలోనే ఆయన ముందుగా ఎమ్మెల్సీను చేసి ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకొని అన్నారు. ఇక మొన్న ఎన్నికలలో సీనియర్ నేతగా ఉండి ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన దేవినేని ఉమా ... అలాగే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టి పోరాటం చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో పాటు 2019 ఎన్నికలకు ముందు జగన్ తో విభేదించి టిడిపిలో చేరి అప్పటినుంచి పార్టీలో కష్టపడుతున్న విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు ముందుగా ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఈ నలుగురికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన తర్వాతే మిగిలిన నేతల గురించి చంద్రబాబు ఆలోచన చేయనున్నారు.