ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో అరడజన్ దాకా సినిమాలు ఉన్నాయి. వీటిలో మొదట ప్రభాస్ - మారుతి కాంబినేషన్ తెర‌కెక్కుతోన్న ది రాజాసాబ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే సినిమా విషయంలో రెబల్ స్టార్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తుంటేనే ఈ విషయం అర్థం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు డైరెక్టర్గా రాజా సాబ్ డైరెక్టర్ మారుతి నిర్మాతలు అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ట్రోల్ చేయటం మొదలుపెట్టేశారు. చాలా ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు.


రెబల్ స్టార్ అభిమానులు అందరూ రాజా సాబ్‌ అప్డేట్ల కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళని మరింత వెయిటింగ్ లో పెట్టేలా చేస్తుంది ఈ చిత్ర బృందం. సెట్స్ మీద ఉన్న ఈ సినిమా గురించి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఉంటారు. అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు. కానీ మేకర్స్ నుంచి అటు దర్శకుడు మారుతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వాళ్లు చాలా నిరాశగా ఫీల్ అవుతున్నారు. రాజా సాబ్‌ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక మోషన్ పోస్టర్ .. ఇంకా ప్రభాస్ గ్లింస్ తప్ప మరో అప్డేట్ ఏమీ రాలేదు. అయితే ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్న సినిమా నుంచి మినిమం రెస్పాన్స్ కూడా యూనిట్ ఇవ్వడం లేదు. ఈ విషయంపై రెబల్ స్టార్ అభిమానులంతా మారుతి మీద విరుచుకుపడుతున్నారు.


స్టార్ హీరోలను హ్యాండిల్ చేయటం మారుతికి అసలు రాదని సినిమాను ఎంగేజ్ చేసేలా ప్రమోషన్ అప్డేట్లు ఎలా ఇవ్వాలో మారుతికి ఎప్పటికీ తెలియదని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా సినిమా ప్రమోషన్లలో దర్శకతీరుడు రాజమౌళిని చూసి నేర్చుకోవాలి అంటూ సలహాలు ఇస్తున్నారు. మారుతి రాజా సాబ్ విషయంలో అభిమానులనే పూర్తిగా సంతృప్తి పరచలేకపోతున్నాడు. ఇక దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్ అభిమానులు సైతం ఎలా ? సంతృప్తి పరచాడో అర్థం కావడం లేదు. ఏదైనా పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమాపై అనుకున్నంత బ‌జ్‌లేదు అన్నది నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: