మహేష్ బాబుకి ముందు నుంచి సైనస్ ప్రాబ్లం ఉందట. ఆ కారణంగా ఆయన ఎక్కువ కూల్ క్లైమేట్ తట్టుకోలేరట . మరీ ముఖ్యంగా కూల్ పదార్థాలకి.. స్వీట్స్ కి ఆయన ఎప్పుడు దూరంగానే ఉంటారట . అయితే మహేష్ బాబుకి సైన్స్ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోవడంతో ఆయన వింటర్ సీజన్ వస్తే చాలు సైనస్ కి సంబంధించిన టాబ్లెట్స్ ను క్రమం తప్పకుండా మర్చిపోకుండా వేసుకుంటారట . నమ్రతానే పక్కనే ఉండి మరీ గుర్తు చేస్తుందట . ఒక్కరోజు అలాంటి టాబ్లెట్ వేసుకోకపోయినా సరే మహేష్ బాబుకి వెంటనే హెడేక్ రావడం .. దాని కారణంగా కళ్ళు రెడ్ గా అయిపోవడం..బ్రీతింగ్ ప్రాబ్లం లాంటిది వచ్చేస్తూ ఉంటాయట.
చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే మహేష్ బాబుని ఈ సైనస్ ప్రాబ్లం బాగా వేధిస్తుందట . సోషల్ మీడియాలో మహేష్ బాబు కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . నమ్రత - మహేశ్ బాబు చాలా అన్యోన్యంగా ఉంటారు. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంటున్న కపుల్స్ ఈ జంటను చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటుంటారు జనాలు. మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్లో పాల్గొనబోతున్నారు . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి . అయితే రాజమౌళి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాల లుక్స్ ఒకటి కూడా బయటికి రాకుండా పక్కాగా ప్లాన్ చేశాడు. మహేష్ బాబు లుక్స్ బయటపడిపోతాయి అన్న భయం కారణంగానే ఆయన ఈ విధంగా చేశారట..!