టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ... టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా .. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ అలాగే మన రాజోలు అమ్మాయి .. సీనియర్ బ్యూటీ అంజలి హీరోయిన్స్ గా కోలీవుడ్ టాప్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా “ గేమ్ ఛేంజర్ ” . . దాదాపు రు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. మరి భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తుండగా మన తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ హైప్ దీనిపై నెలకొంది. ఇలా గేమ్ ఛేంజర్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ నే జరిగినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీ సహా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి గేమ్ ఛేంజర్ ఏకంగా రు. 130 కోట్లకి పైగా టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి రాబోతుంది. ఇందులో ఒక్క నైజాం నుంచే రు. 37 కోట్ల మేర బిజినెస్ చేసింది. నైజాం తో పాటు అటు వైజాగ్ ఏరియా లో దిల్ రాజు ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారు. ఇక ఆంధ్రా లోనూ రెగ్యులర్ గా దిల్ రాజు సినిమాలు పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లే ఈ సినిమా ను.. దిల్ రాజు మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ ఆంధ్రలో 70 కోట్లు - సీడెడ్ నుంచి 20 కోట్లకి పైగా బిజినెస్ చేసిందట. మరి ఈ మొత్తం టార్గెట్ ని గేమ్ ఛేంజర్ ఎలా రీచ్ అవుతుందో ? చూడాలి.