నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్ .. స్టార్ దర్శకుడు బాబి తెర్కక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది .. పక్క మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు దర్శకుడు బాబి .. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి .. డాకూ మహారాజ్ టైటిల్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమా పై అందరి దృష్టి పెరిగింది .. అలాగే ఈ సినిమాల్లో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌ లో కనిపించబోతున్నారు .. అదేవిధంగా బాలయ్యకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.


ఇక డాకు మహారాజ్ సినిమాలోశ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యాజైస్వాల్ తో పాటు, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా నటిస్తుంది. అయితే  బాలీవుడ్ లో హ‌ట్‌ బ్యూటీ ఊర్వశి కి భారీ క్రేజీ ఉంది .. అలాగే తెలుగులో ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది . ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన  ఊర్వశి ఈ సినిమాలోను కీలక పాత్రలో కూడా కనిపిస్తుందని  తెలుస్తుంది .. ఇక డాకూ మహారాజ్ సినిమాలో  ఊర్వశి పోలీస్ ఆఫీసర్గా కనిపించిందని తెలుస్తుంది.


ఇప్పటికే బాలయ్యతో స్పెషల్ సాంగ్లో ఈ ముద్దుగుమ్మ మెరిసిందింది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ఊర్వశి తీసుకున్నరెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .. గతంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి హీరోగా వ‌చ్చిన‌ వాల్తేరు వీరయ్య సినిమాలోను స్పెషల్ సాంగ్లు నటించింది  ఊర్వశి .. ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి దుమ్మురేపింది .. ఇప్పుడు ఊర్వశికి  మరోసారి అవకాశం ఇచ్చాడు బాబి .. కాగా బాలయ్య సినిమాలో నటించినందుకు ఊర్వశి ఏకంగా రెండున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది .. అయితే ఆమె పాత్ర సినిమాలో చాలా తక్కువ సమయం  ఉంటుందని అంటున్నారు .. అదేవిధంగా దబిడి దిబిడే సాంగ్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది .. మరి ఈ వార్తల్లో ఎంతవ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: