తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన గుర్తింపు కలిగిన బ్యానర్లలో ఒకటిగా ముందుకు సాగుతున్న వాటిలో మైత్రి సంస్థ వారు మంచి స్థానంలో ఉంటారు. వీరు ఇప్పటికే అనేక సినిమాలను నిర్మించారు. అందులో చాలా మూవీలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ బ్యానర్ వారు కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 అనే పాన్ మూవీ ని రూపొందించారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు.

మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మైత్రి సంస్థకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం కూడా వీరి చేతిలో అనేక పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ వారు ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని కూడా ఈ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

అలాగే రామ్ చరణ్ , సుకుమార్ కాంబోలో రూపొందబోయే పాన్ ఇండియా మూవీ ని కూడా ఈ బ్యానర్ వారి రూపొందించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా మరి కొంత కాలం లోనే ప్రారంభం కాబోతుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీళ్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ ఇండియా మూవీ రూపొందించబోతున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముగ్గురు హీరోలతో నాలుగు సినిమాలను ఈ బ్యానర్ వారు లైన్ లో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: