ఇక హీరోలుగా మారిన వారిలో సుడిగాలి సుదీర్ , గెటప్ శీను , రాకింగ్ రాకేష్ తో పాటు మరికొందరు ఉన్నారు .. వీరితో పాటు వేణు , ధనరాజ్ , అదిరే అభి వంటి వారు దర్శకులుగా అవతారం ఎత్తరు .. అయితే ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ కి పాన్ ఇండియా సినిమా నుంచి భారీ ఛాన్స్ వచ్చిందనే వార్త బయటకు వచ్చింది. ఓ జబర్దస్త్ హాట్ బ్యూటీ కి తాజాగా ఓ పాన్ ఇండియా సినిమా నుంచి భారీ ఆఫర్ అందుకుందట .. ఇక అది కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలో అవకాశం అందుకుందిని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి .. ఇంతకు ఈ హాట్ బ్యూటీ ఎవరు అంటే .. మరెవరో కాదు జబర్దస్త్ అందాల యాంకర్ రష్మీ గౌతమ్ .. యాంకర్ రష్మి తన మాటలతో అందాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ..
జబర్దస్త్ ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి క్రెజ్ వచ్చింది . రష్మీ టీవీ షో లతో పాటు పలు సినిమాల్లోను నటించింది .. గతంలో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది .. ఆ తర్వాత హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది .. గుంటూరు టాకీస్ సినిమాలో తన హాట్ నెస్ తో కవ్వించింది .. అలాగే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలోను చిన్న పాత్రలో కనిపించింది .. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 లో ఓ మంచి అవకాశం వచ్చిందని తెలుస్తుంది .. ఇప్పటికే సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ టీం ఆమెని సంప్రదించారని ఆ తర్వాత ఆమె ప్రశాంత్ కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపింది అని కూడా తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదు తెలియదు కానీ.. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.