ఏంటి ప్రభాస్ హీరోయిన్ కి ఆ డైరెక్టర్ నిజంగానే చీర గిఫ్ట్ గా ఇచ్చాడా.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవాలనే ఆత్రుత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మరి డైరెక్టర్ తో చీర గిఫ్ట్ గా ఇప్పించుకున్న హీరోయిన్ ఎవరో కాదు ప్రభాస్ ఫౌజి మూవీ హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్. ఇమాన్వి ఇస్మాయిల్ పేరు చెప్పగానే చాలామందికి తన అందమైన రూపమే గుర్తుకొస్తుంది. ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా హీరోయిన్గా చేయకపోయినప్పటికీ మొదటి సినిమానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం కొట్టేసింది. ఇక ఈ హీరోయిన్ అదృష్టం మామూలుగా లేదు అని చాలామంది అనుకున్నారు.అలా ఫౌజి మూవీలో హీరోయిన్గా చేస్తున్న ఇమాన్వీ క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో పెరిగిపోయింది. కేవలం పూజ కార్యక్రమాలలో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని షేక్ చేసింది.

ఇక పూజ కార్యక్రమాలలో చాలామంది ఈ హీరోయిన్ కట్టుబట్టు అందర్నీ అట్రాక్ట్ చేసింది.ముఖ్యంగా హనూ రాఘవపూడి సినిమాలో హీరోయిన్ అంటే కచ్చితంగా సాంప్రదాయంగా ఉంటుంది. అలా సీతారామం సినిమాలో మృణాల్ ని మనం చూసాం. అలా ఫౌజి సినిమాలో కూడా ఇమాన్వీ ఇస్మాయిల్ని మళ్ళీ చూడబోతున్నాం.సినిమా పూజ కార్యక్రమాలలో ప్రభాస్ తో కనిపించిన ఈ అమ్మాయి ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. షాట్స్, రీల్స్ చేస్తూ ఉన్న ఈ అమ్మాయి ఒకసారిగా ప్రభాస్ పక్కన హీరోయిన్ అంటే చాలామంది షాక్ అయిపోయారు. అయితే ఈ అమ్మాయి ఫౌజి పూజా కార్యక్రమాలలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది గోల్డెన్ కలర్ సారీ దానికి తగ్గట్లు ఉండే బ్లౌజ్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చీర వెనుక ఒక కథ ఉందట.

అదేంటంటే.. ఫౌజీ సినిమా పూజ కార్యక్రమంలో హీరోయిన్ కట్టుకున్న చీరని ఇమాన్వికి గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరో కాదు డైరెక్టర్ హను రాఘవపూడి.అవును  హనూ రాగవపూడి స్వయంగా ఇమాన్వి ఇస్మాయిల్ కి షాపింగ్ మాల్ కి వెళ్లి చీర కొనుక్కొచ్చారట. అంతేకాదు చీర కొనడానికి చాలా టైం ని కూడా కేటాయించి ఆ సారీ ని కొన్నారట. అలా కొన్ని గంటలపాటు షాపింగ్ చేసి చివరికి ఇమాన్వికి బాగా సెట్ అయ్యే చీరను కొనుక్కొచ్చారు హనూ రాగవపూడి. అయితే ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.కానీ సడన్గా ఈ విషయం నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అయిపోతున్నారు. చీర విషయంలోనే అంత జాగ్రత్తలు తీసుకొని స్వయంగా షాపింగ్ చేసిన హను రాఘవపూడి సినిమా విషయంలో మరెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: