ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో గేమ్ చేంజర్ మూవీ జనవరి 10 వ తేదీన విడుదల కానుండగా , డాకు మహారాజ్ మూవీ జనవరి 12 వ తేదీన , సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది.

ఇకపోతే ఈ మూడు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. మొదటగా గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ ట్రైలర్ ఇప్పటివరకు తెలుగు సినిమా పరిశ్రమ నుండి విడుదల అయిన ట్రైలర్లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన ట్రైలర్లలో మూడవ స్థానంలో నిలిచింది. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 7.98 మిలియన్ వ్యూస్ , 195.5 కే లైక్స్ దక్కాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ట్రైలర్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే నిన్న సంక్రాంతికి వస్తున్నా మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యి ఇప్పటికి కేవలం 21 గంటలు మాత్రమే అవుతుంది. 21 గంటలు ముగిసే సరికి ఈ మూవీ ట్రైలర్ కు యూట్యూబ్ లో 12 మిలియన్ వ్యూస్ , 226 కే లైక్స్ లభించాయి. దానితో ఈ మూవీ ట్రైలర్ డాకు మహారాజ్ ట్రైలర్ కు 24 గంటల్లో వచ్చిన వ్యూస్ , లైక్స్ ను 21 గంటల్లోనే క్రాస్ చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: