సీడెడ్ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సీడెడ్ ఏరియాలో 51.04 కోట్ల కలెక్షన్లను రాబట్టి సీడెడ్ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో కొనసాగుతుంది.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా ఈ ఏరియాలో 35.10 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ ప్రస్తుతానికి సీడెడ్ ఏరియాలో అత్య ధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో రెండవ లిస్టులో కొనసాగుతుంది . రాబోయే రోజుల్లో ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ ను బీట్ చేస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

బాహుబలి 2 : ప్రభాస్ హీరో గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 34.75 కోట్ల కలెక్షన్లతో సీడెడ్ ఏరియాలో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

దేవర పార్ట్ 1 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి సీడెడ్ ఏరియాలో 31.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసిన నాలుగో స్థానంలో కొనసాగుతుంది.

సలార్ పార్ట్ 1 : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో 22.75 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: