టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు .. ఏకంగా మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడు సినిమా లపై అంచనాలు మామూలుగా లేవు. ఒకటి రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో వస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ .. రెండోది నటసింహం బాలకృష్ణ - డైరెక్టర్ కొల్లి బాబి కాంబినేషన్ లో వస్తోన్న డాకూ మహారాజ్ .. ఇక మూడో సినిమా వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబో లో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం. మూడు సినిమా లపై అంచనాలు స్కై రేంజ్ లోనే ఉన్నాయి. ఈ మూడు సినిమాల కాంబినేషన్లు అలాంటివి.
ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తున్న సినిమా లలో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ... అంజలీ మరో బ్యూటిఫుల్ రోల్ లో నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్ .. ఈ సినిమా ఈ నెల 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. రిలీజ్ దగ్గరకి వస్తున్న సమయంలో మరింత హైప్ ఈ సినిమా పై ఉంది. ఇక ఈ సినిమా లో విలన్ గా నటించిన దర్శకుడు ఎస్ జె సూర్య ఈ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సూర్య కోలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమాకి రు. 400 నుంచి 500 కోట్లు బడ్జెట్ ని దిల్ రాజు పెట్టారని తెలిపారు. దీంతో ఇప్పుడు సౌత్ సినిమా వాళ్లు అందరూ ఒక్క సారిగా షాక్ అయిపోయారు. ప్రస్తుతం శంకర్ కు ఉన్న ఫామ్ నేపథ్యం లో నిర్మాత దిల్ రాజు చాలా పెద్ద రిస్క్ చేశారని ప్రతి ఒక్కరు చర్చించు కుంటున్నారు.