తెలుగు,తమిళ్  చిత్రాలతో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు హీరో అజిత్. అజిత్ నటుడుగానే కాకుండా ఎప్పుడూ కూడా లాంగ్ డ్రైవ్  వెళ్తూ దూర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అలా ఇప్పటికీ ఎన్నో ప్రాంతాలను కూడా చుట్టి వేయడం జరిగింది. అలాగే హీరో అజిత్ కి రేసింగ్ లన్న కూడా చాలా ఇష్టము. అజిత్ ఇప్పటికే ఎన్నోసార్లు కూడా రేసింగ్ లో పాల్గొనడం జరిగింది. తాజాగా అజిత్ కు రేసింగ్ లో పెను ప్రమాదం తప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



హీరో అజిత్ దుబాయ్ రేసింగ్ లో ట్రాక్ ను అజిత్ కారు ఢీ కొనడంతో పూర్తిగా కారు డ్యామేజ్ అయ్యిందట. దీంతో హీరో అజిత్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలియడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. ప్రస్తుతం అజిత్ సినిమాల విషయానికి వస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారట.


ఏప్రిల్ 10వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. వాస్తవానికి సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్న  కొన్ని కారణాల చేత వాయిదా పడింది. ప్రస్తుతం అజిత్ రేసింగ్ కోసం దుబాయ్ లో శిక్షణ తీసుకుంటూ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి అజిత్ ఎప్పటికి ఎన్నో ఇంటర్నేషనల్ రేసింగ్ లో పాల్గొన్నప్పటికీ కొత్తదనం కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు ఎక్కువగా రేసులకే వెళుతూ ఉంటారు హీరో అజిత్. అందుకే అజిత్ చాలా సన్నివేశాలను డూప్ లేకుండా రేసింగ్లలో నటిస్తూ ఉంటారు. మొత్తానికి హీరో అజిత్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: