గత కొద్ది రోజుల నుంచి పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య, ప్రముఖ గాయని శివశ్రీ ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి వీరు గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తోంది. మరి వీరిద్దరి పరిచయం గురించి కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. వాటి గురించి చూద్దాం. చెన్నైకి చెందిన శివశ్రీ తన కుటుంబం కూడా సంగీత కుటుంబానికి చెందినది. ఈమె తండ్రి శ్రీ స్కంద ప్రసాద్ కూడా మృదంగ విధ్వంసుడట. అంతేకాకుండా శివశ్రీ ఇంట్లో నిత్యం సంగీతాన్ని సైతం ఎక్కువగా ఆహ్లాదించేవారట.qఅందుకే శివశ్రీకి చిన్నతనం నుంచి సంగీతం సైతం బాగా పట్టు ఉన్నది. దీంతో శివశ్రీ చిన్న వయసు నుంచి కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిందట.


అలాగే చదువును కూడా ఎంతో ఇష్టంగానే చదివి బీటెక్ పూర్తి చేసిందట. నృత్యంలో కూడా ఎంఏ పూర్తి చేసిన శివశ్రీ మద్రాస్ కళాశాలలో సంస్కృత విభాగంలో చదువుతున్నదట. నామ సంకీర్తనలు ప్రావీణ్యం పొందిన శివశ్రీ ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రస్తుతం నడుపుతోందట. ఇందులో తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. గత ఏడాది జనవరిలో రాముడు పైన భక్తిని చూపిస్తూ ఒక వీడియో షేర్ చేయగా ప్రధాన మోదీనే మెచ్చుకునేలా చేసింది. దీంతో ఈమె పేరు దేశవ్యాప్తంగా కూడా భారీ పాపులారిటీ అందుకున్నది.


దీనివల్ల పలు చిత్రాలలో కూడా ఈమెకు పాడే అవకాశం వచ్చిందట. పొన్నియన సెల్వన్ -1 చిత్రంలో helhe neenu అనే పాటను పాడిందట. సీక్వెల్లో కూడా మరొక పాటను పాడిందట శివశ్రీ. ఇలా తన పాటలు విన్న తర్వాత ఏఆర్ రెహమాన్ సార్ కూడా తనను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు అంటూ వెల్లడించింది. ఆ తర్వాత తన వద్ద పనిచేసే ఒక వ్యక్తి తనను కలిశారని.. ఈ విషయం తనకు తెలిసి ఆశ్చర్యపోయానని వెల్లడించింది.


మరొకవైపు భారత నాట్య కళాకారునిగా మంచి పేరు సంపాదించిన శివశ్రీ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నదట. ఈమె ప్రతిష్టాత్మకమైన భారత కళా చూడమని అవార్డును కూడా అందుకున్నదట. అలాగే భక్తి గాన కోకిల, యువ సన్మాన్ వంటి పురస్కారాలు కూడా అందుకున్నదట.



సంగీతాన్ని కెరియర్ గా భావించిన శివశ్రీ ఇదే సంగీతమే తన జీవిత భాగస్వామిని కూడా కలిపిందట.. అతి చిన్న వయసు అయిన పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్యతో ఇటీవల ఈమె ఎంగేజ్మెంట్ పూర్తి అయింది. వాస్తవానికి వీరిద్దరి నేపథ్యాలు వేరుగా ఉన్న సంగీత కరిచేరిలో వీరిద్దరూ భాగమయ్యారట. 2021లో తేజస్వి ఎన్నికల ప్రచారం కోసం పుదుచ్చరి వెళ్ళగా అక్కడ శివశ్రీ సంగీత కచేరి చేస్తోందట. తన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకొని యువ ఎంపీ అక్కడికి చేరుకోగా అదే రోజు తన ఇష్టాన్ని కూడా ఆ వేదికమైన తెలియజేశారట. శివశ్రీ కి తాను పెద్ద అభిమానిని అని ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వచ్చాను దగ్గరలో తన ఆఫీసు ఉందని చెప్పడంతో తనని కలవాలని వచ్చారని అయితే ఇలా కచేరితో ఆమె సంగీతాన్ని  ఆస్వాదించడం ఇలా అన్నీ అనుకోకుండా జరిగిపోయాయని తెలిపారు. అదే స్టేజ్ మీద శివశ్రీని ప్రశంసించారు తేజస్వి.. అల వీరిద్దరి మధ్య జరిగిన ఒక పరిచయమే ప్రేమగా మారిందట. వీరిద్దరూ ఇరువురు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మరి నిశ్చితార్థం చేసుకుని ఈ ఏడాది మార్చి 4వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: