అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కలెక్షన్స్ తో ఇండియానే షేక్ చేస్తూ ఉండగా ప్రస్తుతం నెంబర్ 2 ఇండియన్ చిత్రాలు కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా పుష్ప 2 చిత్రం నిలిచింది.. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2020లో వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించడం జరిగింది. ప్రస్తుతమైతే కలెక్షన్స్ భారీగానే దూసుకుపోతోంది .గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హవా తగ్గలేదు. ఈ సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదు అవ్వగా.. ఈ కేసు పైన అల్లు అర్జున్ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.


పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో తొక్కిసలాటలో మహిళా మృతి చెందగా ఇందులో అల్లు అర్జున్ A-11 గా ఉన్నారు.ఈ కేసు విషయంపై జైలుకు కూడా వెళ్లడం జరిగింది అల్లు అర్జున్. బెయిల్ మీద కూడా రావడం జరిగింది..ఇటీవలే ఈ సమస్య కూడా దాదాపుగా ముగిసినట్టుగా కనిపిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయగా అది వైరల్ గా మారుతున్నది. నిత్యం తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను అభిమానులకు పంచుకుంటూ ఉంటుంది.


తాజాగా స్నేహ రెడ్డి అల్లు అర్జున్ తన పిల్లల ఫోటోలను సైతం పంచుకున్నది.. అల్లు అర్జున్ తన పిల్లలతో సరదాగా గడిపిన కొన్ని క్షణాలను సైతం షేర్ చేస్తూ డిసెంబర్ మెమోరీస్ అంటూ ఫోటోలను కూడా పంచుకున్నది స్నేహ రెడ్డి.. అయితే చివరిగా ఆమె షేర్ చేసిన సెల్ఫీ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు స్నేహ రెడ్డి మెడలో ఉండే లాకెట్ అల్లు అర్జున్ సైన్ AA అని ఉన్నటువంటి డాలర్ ని వేసుకోవడంతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోల పైన చాలామంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: