ప్రజెంట్ పాన్ ఇండియా సినిమా దగ్గర పలు భారీ మల్టీస్టారర్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు కలగొట్టాయి .. అలాంటి సినిమాల్లో బాగా వినిపిస్తున్న మూవీ త్రిబుల్ ఆర్ కూడా ఒకటి .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా తర్వాత మరన్ని క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి .. ఇక ఇప్పుడు తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బాలయ్య టాక్ షో అన్ స్టాప్పబుల్ లో పంచుకున్నట్టు గా తెలుస్తుంది .
ఇక మరి బాలయ్య క్రేజీ అడిగిన ప్రశ్న ఏమిటంటే .. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇద్దరి లో ఎవరి తో మల్టీస్టారర్ సినిమా చేస్తావు అని ఆయన అడిగితే . తాను మహేష్ తో చేసేందుకు రెడీ అని చరణ్ ఆన్సర్ ఇచ్చినట్టు గా తెలుస్తుంది .. దీని తో ఒకవేళ పరిస్థితులన్నీ కుదిరితే రాబోయే రోజుల్లో ఈ మెగా సూపర్ మల్టీస్టారర్ ప్రేక్షకులు ముందుకు రాబోతుంద నే చెప్పాలి .. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రశ్నల కు కూడా చరణ్ సమాధానాలు ఇచ్చినట్టు గా తెలుస్తుంది ..
ఇక ఈ ఎపిసోడ్ జనవరి 8 న ఆహా లో ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇక్కడ.. చరణ్, ప్రభాస్‌లు మంచి స్నేహితులు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షోలోనే ప్రభాస్‌కు కాల్ చేసి మాట్లాడాడు చరణ్. రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు.