సంక్రాంతి ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో సినిమా ప్రియులు కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతి బ‌రిలో రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజ‌ర్ తో పాటూ బాల‌య్య డాకు మ‌హ‌రాజ్, వెంకటేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 10న గేమ్ ఛేంజ‌ర్ సినిమా విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాత రెండు రోజుల గ్యాప్ తో డాకు మ‌హ‌రాజ్, సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమాల కోసం ఏపీలో ప్ర‌త్యేక జీవోను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మూడు సినిమాల కోసం ప్ర‌త్యేక జీవో తెచ్చిన స‌ర్కార్ అర్థ‌రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షోల‌కు టికెట్ ధ‌ర రూ.600 గా నిర్ణ‌యించింది.

గేమ్ ఛేంజ‌ర్ బెనిఫిట్ షో కోసం జ‌న‌వ‌రి 10న ఏకంగా ఆరు షోల‌కు అనుమ‌తి ఇచ్చింది. అంతే కాకుండా ఎర్లీ మార్నింగ్ షోల‌కు సైతం ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. టికెట్ ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే మ‌ల్టీ ప్లెక్స్ లో రూ.175 రూపాయ‌లు, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.135 అద‌నంగా వసూలు చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వ‌ర‌కు ఈ ధ‌ర‌లు కొన‌సాగనున్నాయి. అంతే కాకుండా 11వ తేదీ నుండి ప్రతిరోజూ 5 షోలు ప్ర‌సారం చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. 23 త‌ర‌వాత సాధార‌ణ ధ‌ర‌ల‌తో నాలుగు షోలు ప్ర‌సారం చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది.

ఇదిలా ఉంటే తెలంగాణ‌లో కూడా ఇప్పుడు స్పెష‌ల్ జీవో రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో మాధిరిగా స్పెష‌ల్ జీవో తీసుకువ‌చ్చేలా ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో దిల్ రాజు మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే రేపు టికెట్ ధ‌ర‌లకు సంబంధించి జీవో కూడా వ‌చ్చే అవకాశం ఉంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక పుష్ప 2 బెనిఫిట్ షో ఘ‌ట‌న త‌ర‌వాత తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో స్పెష‌ల్ షోలు ర‌ద్దు చేస్తు నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌భుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: