గత వారం రోజుల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో జబర్దస్త్ యాక్టర్ రీతు చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఈమె ఒక స్కామ్ లో ఇరుక్కున్నదని ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో అడ్డంగా బుక్ అయినట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఏపీకి చెందిన ల్యాండ్ మాఫియాలో ఈమె పేరు బయటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జగన్ సోదరుడు సునీల్, జగన్ పి ఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకి రావడం జరిగింది. వీరితోపాటు రీతూ చౌదరి ఈమె మాజీ భర్త శ్రీకాంత్ పైన కూడా ఆరోపణలు వినిపించాయి.


శ్రీకాంత్ కు రీతూ చౌదరి రెండవ భార్య.. 700 కోట్ల స్కాంప్ పైన శ్రీకాంత్ స్పందించడం జరిగింది. తనపై వస్తున్న ఆరోపణలు నిజం లేదని.. అలాగే రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా తనకు చెందినవే అంటూ శ్రీకాంత్ వెల్లడించారు. తాము సంపాదించుకున్నవి అని కూడా వెల్లడించడం జరిగింది. అలాగే తాను ఎవరికీ కూడా బినామీ కాదు అంటూ వెల్లడించారు. అయితే తాజాగా ఈ స్కాం పైన రీతూ చౌదరి స్పందించినట్లు తెలుస్తోంది.


ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ రీతూ చౌదరి ఇలా మాట్లాడుతూ.. ఈ స్కాంపై మాట్లాడుతూ నాకు శ్రీకాంత్ కు ఎలాంటి సంబంధం లేదని.. ఏడాది క్రితమే అతనితో విడిపోయానంటూ వెల్లడించింది.. గతంలో తాము కలిసి ఉన్న సమయంలో సంతకం పెట్టమంటేనే పెట్టానంటూ వెల్లడించింది రీతూ చౌదరి.. శ్రీకాంత్తో తాను గోవా పార్టీకి వెళ్లలేదని ఆయనతో చాలామంది సినిమా ఆర్టిస్టులు కూడా టచ్ లో ఉన్నారని అయితే వారి పేర్లు చెప్పలేనని తెలిపింది.. తన అకౌంట్లో జమ ఆయన నాలుగు కోట్ల రూపాయల నుంచి మాత్రమే తన గురించి ఈ ప్రస్తావన వచ్చిందని వెల్లడించిందనీ.. ఏసీబీ ఆ అకౌంటును  కూడా సీజ్ చేశారని తాను కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారని వెల్లడించింది.


శ్రీకాంత్తో వివాహమైందని కానీ అలా అయినా కొద్ది రోజులకే భేదాభిప్రాయాలు వచ్చాయని శ్రీకాంత్తో విడాకులు తీసుకొని ఏడాది పైనే అవుతోందని వెల్లడించింది. ఈ విషయాలన్నీ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: