సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా... ఈ రోబో 2.0 తీశారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా చేయగా అక్షయ్ కుమార్ విలన్ గా చేయడం జరిగింది. అలాగే ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించారు. బసవంగా రోబో సినిమా గతంలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ తరుణంలోనే రోబో 2.0 తీయాలని దర్శకుడు శంకర్ భావించారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 29 2018 సంవత్సరంలో ఈ సినిమాను రిలీజ్ చేయడం జరిగింది.
శంకర్ ఎక్కువగా లైకా ప్రొడక్షన్స్ వారితోనే సినిమాలు చేస్తూ ఉంటారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ను వాడుతుంటారు. అయితే ఈ రోబో 2.0 సినిమాను... ఏకంగా 570 కోట్లు పెట్టి 2018లోనే తీయడం జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత.. రోబో సినిమా తరహాలో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు. కాస్త తక్కువ కలెక్షన్స్ వచ్చినప్పటికీ... సినిమా మాత్రం బంపర్ హిట్ అయింది.
రోబో 2.0 సినిమా మొత్తం 800 కోట్లు సంపాదించగలిగింది. ఇది గ్రాస్ కలెక్షన్ మాత్రమే. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా 136.16 కోట్లు సంపాదించగలిగింది. ఇక ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసరికి 655. 81 కోట్లు ఈ సినిమా రాబట్టగలిగింది. అంటే వీళ్లు అనుకున్న దానికంటే కలెక్షన్స్ తక్కువగానే వచ్చింది. కానీ ప్రపంచవ్యాప్తంగా.... బాహుబలి 2 తర్వాత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇలా పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు శంకర్ సక్సెస్ అవుతున్నారు.