కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇకపోతే దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించినప్పటి నుండి ఆయన చాలా సంవత్సరాల పాటు అపజయాలే లేకుండా కెరియర్ను అద్భుతమైన స్థాయిలో ముందుకు సాగించాడు. ఇకపోతే శంకర్ కొన్ని సంవత్సరాల క్రితం బాయ్స్ అనే సినిమాలో దర్శకత్వ వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సిద్ధార్థ్ హీరోగా నటించగా ... జెనీలియా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కంటే ముందు వరుసగా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ వచ్చిన శంకర్మూవీ తో కాస్త యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ని ట్రై చేశాడు.

శంకర్ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఈ మూవీ కంటే ముందు సిద్ధార్థ్ , జెనీలియా లకి ఏ మాత్రం క్రేజ్ లేకపోయిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు తమిళ్ లో కాస్త యావరేజ్ టాక్ వచ్చిన తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ తమిళ్ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ కలక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ శంకర్ పూర్వపు మూవీల రేంజ్ లో బారి విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ వసూలు చేయలేకపోయింది. కాకపోతే ఈ సినిమాను తెరకెక్కించిన విధానానికి శంకర్ కి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం కూడా ఎంతో ఉపయోగపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: