ఆషోకు సంబంధించిన ట్రైలర్ విడుదలచేశారు. ఈట్రైలర్ లో రామ్ చరణ్ అకిరా నందన్ ఫిలిమ్ ఎంట్రీ గురించి లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరా నందన్ ఫిలిమ్ ఎంట్రీ గురించి ఎంతగానో ఆశ పడుతున్నారు. అయితే ఈవిషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఖంగారు పడకుండా ప్రస్తుతం అమెరికాలో చదువు కుంటున్న అకిరా నందన్ చదువు పూర్తి అయిన తరువాత మాత్రమే అతడి ఫిలిమ్ ఎంట్రీ గురించి ఒక క్లారిటీ ఇవ్వగలను అంటూ వ్యూహాత్మకంగా కామెంట్స్ చేశారు.
అయితే పవన్ అభిమానుల కోరికలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులలోను వీలైనంత త్వరలో అకిరా ఫిలిమ్ ఎంట్రీ ఉంటే బాగుంటుందని ఓపెన్ గానే అభిప్రాయపడుతున్నారు. ఈవిషయాల పై బాలకృష్ణ వేసిన ప్రశ్నలకు రామ్ చరణ్ కొన్ని లీకులు ఈఇంటర్వ్యూలో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యాపార సంస్థ ప్రారంభానికి అతిధిగా వచ్చిన రేణు దేశాయ్ మీడియాతో మాట్లాడుతూ తాను కూడ అకిరా నందన్ ను హీరోగా చూడాలని కోరుకుంటున్నాను అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
ఈమధ్య జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు రామ్ చరణ్ అకిరా నందన్ లు ఒక ప్రత్యేక విమానంలో రాజమండ్రి వచ్చినప్పుడు వీరిద్దరూ మీడియాకు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే సంగీతం పట్ల ఆశక్తి కనపరుస్తున్న అకిరా ప్రస్తుతం మ్యూజిక్ క్లాసులకు వెళుతూ కొన్ని ట్యూన్స్ కూడ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈఇంటర్వ్యూలో చరణ్ అకిరా నందన్ చిన్నప్పటి విషయాలను బాలయ్యతో షేర్ చేసుకోవడంతో ఈ ఇంటర్వ్యూ పై అందరిలోను ఆశక్తి బాగా ఉంది..