ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలలో గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం , సినిమాలను దిల్ రాజు నిర్మించగా , డాకు మహారాజ్ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ యొక్క నైజాం హక్కులను కూడా దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరో సినిమా విడుదల అయినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను భారీగా పెంచుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ రేట్లు భారీగా పెంచారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో పుష్ప 2 సినిమా సమయంలో సంధ్య థియేటర్ లో తొక్కి సలాట కారణంగా ఓ మహిళ మృతి చెందడం , ఓ చిన్న బాబు ఇప్పటికీ హాస్పిటల్ లో ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్లు పెంచాను అని అన్నాడు. ఇకపోతే ఈ మూడు సంక్రాంతి సినిమాల నైజాం రైట్స్ దిల్ రాజు దగ్గర ఉండడంతో ఆయన ప్రధానంగా గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరలను తెలంగాణ రాష్ట్రంలో పెంచేందుకు ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా నాగ వంశీ మాకు డాకు మహారాజ్ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. మాకు ఉన్న రేట్లు సరిపోతాయి అని చెప్పుకొచ్చాడు. ఇక ఎటు తిరిగి దిల్ రాజు కచ్చితంగా గేమ్ చేంజర్ సినిమాకు నైజాం ఏరియాలో టికెట్ రేట్లను పెంచుకోవాలి అనే ప్రయత్నాలను సాగిస్తున్నట్లు తెలుస్తుంది. మరి అందులో ఆయన సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: