నందమూరి సింహం బాలకృష్ణ సినిమాలలో భారీ డైలాగ్స్ ఉంటాయి. బాలయ్య డైలాగ్స్ కోసమే అతడి సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. అయితే దీనికి భిన్నంగా ‘డాకు మహారాజ్’ ఉండబోతోందా అన్న సందేహాలు ఈ మూవీ ట్రైలర్ చూసిన కొందరికి కలుగుతోంది. ఈమూవీ ట్రైలర్ లో ఎక్కడా బాలయ్య పంచ్ మార్క్ భారీ డైలాగ్స్ కనిపించలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి.



దీనితో ఈసినిమా కథ డిఫరెంట్ గా ఉండబోతోందా అన్న సందేహాలు బాలయ్య అభిమానులలో కలుగుతున్నాయి. దర్శకుడు బాబి ఈమూవీ ప్రమోషన్ లో చెపుతున్న విషయాల ప్రకారం ఇప్పటివరకు బాలకృష్ణ తన కెరియర్ లో చేయని డిఫరెంట్ పాత్ర ఈమూవీలో ఉంటుందని ముఖ్యంగా ఒక పాప సెంటిమెంట్ కూడ ఈమూవీ కథకు అదనపు ఆకర్షణ అని చెపుతున్న నేపధ్యంలో బాలయ్యతో దర్శకుడు బాబి ఒక ప్రయోగాన్ని చేస్తున్నాడా అన్న సందేహాలు బాలయ్య అభిమానులకు కూడ కలుగుతున్నాయి.



మూవీ ట్రైలర్ లో కనిపిస్తున్న గ్రాండ్ విజువల్స్ స్టయిలిష్ యాక్షన్ సీన్స్ ఒక పాన్ ఇండియా మూవీగా అనిపిస్తున్న నేపధ్యంలో ఈ మూవీని తమిళ హిందీ భాషలలొ కూడ విడుదల చేసే వ్యూహాలతో ఈ మూవీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఉంది అంటూ మరొక కొత్త ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మాస్ కంటెంట్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈమూవీలో సీన్స్ ఉంటాయని దర్శకుడు బాబి అంటున్నాడు.



‘యానిమల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన బాబీ డియోల్ బాలకృష్ణ లపై చిత్రీకరించిన సీన్స్ ఈ మూవీని అభిమానించే నందమూరి ఫ్యాన్స్ కు ఒక విందు భోజనం లా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుండి లీకులు వస్తున్నాయి. ఈమూవీలో రవి కిషన్, షైన్ టామ్ చాకో లాంటి ఆర్టిస్టులు పాల్గొనడం తన అదృష్టం అనీ బాలయ్య తన సన్నిహితులతో అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: