నందమూరి బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే మూవీ మేకర్స్ కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. అలాగే ఈ మూవీ టీజర్ , ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి బాలకృష్ణ , ఊర్వశి రౌటేలా మధ్య సాగే దబిడి దిబిడి అనే మాస్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ , ఊర్వసి రౌటేలా మధ్య వచ్చిన కొన్ని డాన్స్ స్టెప్పులపై నెగటివ్ కామెంట్లు వచ్చాయి.

ఇకపోతే తాజాగా డాకు మహారాజ్ మూవీ యూనిట్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొంది. అందులో భాగంగా నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజా పాత్రికేయుల సమావేశంలో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో ఆ మాస్ సాంగ్ కి ఆ స్టెప్ లు పాట చేయడానికి ఒప్పుకోలేదు. దానితో ఊర్వశి రౌటేలా తో ఆ స్టెప్ లు వేయించాం అంటూ నాగ వంశీ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: