శంకర్ దశకతంలో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ పొందినవి. శంకర్ ముఖ్యంగా సమాజంలో ఉండే ఎన్నో సామాజిక అంశాలను సమస్యలను ఆధారంగా తీసుకొని సినిమాలు తెరకెక్కిస్తారు. ఇక ఈయన డైరెక్షన్ చేసిన జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు,రోబో, శివాజీ వంటి సినిమాలు సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ని ఏ లెవెల్ కి తీసుకువెళ్లాయా చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమికుడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా స్టార్ట్ అయిన సమయంలో సినిమాకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.కానీ ఆ అడ్డంకులు అన్నింటిని దాటుకొని డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు.ముఖ్యంగా ప్రేమికుడు సినిమా షూటింగ్ ని ఆపేయాలని అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి ఏకంగా నిర్మాతకి డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వెనక్కి తగ్గని ప్రేమికుడు చిత్ర యూనిట్ సక్సెస్ఫుల్గా సినిమాని కంప్లీట్ చేసుకొని విడుదల చేసింది.

అయితే గవర్నర్సినిమా షూటింగ్ని ఆపేయమనడానికి  కారణం ఏంటో చూద్దాం. శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా నగ్మాలు హీరో హీరోయిన్గా చేసిన ప్రేమికుడు సినిమాలోని కాన్సెప్ట్ ఏంటంటే..ఒక గవర్నర్ కూతురిని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమించడం. అయితే ఇది గవర్నర్ కి వ్యతిరేకంగా ఉంది అనే విషయం తెలుసుకున్న అప్పటి గవర్నర్ సినిమా ఆపేయమని నిర్మాతకు,డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారట.కానీ వీళ్ళిద్దరూ అస్సలు కాంప్రమైజ్ కాకుండా అప్పటి సీఎం అయినటువంటి జయలలిత దగ్గరికి వెళ్లి కలిసారు. ఇక సీఎం కూడా సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు పెట్టకుండా తెరకెక్కించండీ అని చెప్పారట. ఇక సీఎం అండదండతో డైరెక్టర్ శంకర్ మళ్ళీ సినిమాని మొదలుపెట్టారు. అలా ప్రేమికుడు సినిమాకి ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నింటినీ దాటుకొని శంకర్ ప్రేమికుడు సినిమాని పూర్తి చేశారు. ఇక ఈ సినిమాకి నిర్మాత టీ. కుంజుమన్ బడ్జెట్ ఎంతైనా సరే పెడతానని ముందుకు వచ్చారు. ఎందుకంటే శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమా భారీ హిట్ అయింది.

ఈ సినిమాకి కూడా కుంజుమనే నిర్మాతగా చేశారు. అయితే ఆ లాభాలు దృష్టిలో పెట్టుకున్న నిర్మాత ప్రేమికుడు సినిమాకి ఎంత బడ్జెట్ అయినా పెడతానని ముందుకు వచ్చారు.అలాగే ఈ సినిమాలోని చికుబుకు చికుబుకు రైలే అనే పాట ఇప్పటికి కూడా యూత్ ని ఎంత ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ హీరోగా నటించిన ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా డ్యాన్స్ తో పాటు యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.ఈ సినిమాలో నగ్మా గ్లామర్ సినిమాకి మరింత ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. అలా పాటలు,డాన్స్,గ్లామర్, డైరెక్షన్ ఇలా ప్రతి ఒక్కటి బాగుండడంతో 1994 సెప్టెంబర్ 17న విడుదలైన ప్రేమికుడు మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి షోతోనే సినిమా ఏ లెవెల్ లో అందరికీ అర్థమైపోయింది. దీంతో సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకి ఎగబడ్డారు. అలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఈ సినిమా చివరికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది

మరింత సమాచారం తెలుసుకోండి: