సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాల నుంచి మూడు ట్రైలర్లు వచ్చేసాయి. ట్రైలర్లతో సినిమాలపై క్లారిటీ వచ్చేసింది. ఇక మిగిలింది ముక్కోణపు పోటీ మాత్రమే. మూడు సినిమాల ట్రైల‌ర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.


గేమ్ ఛేంజెర్ :
గేమ్ ఛేంజ‌ర్‌ ట్రైలర్ నిజాయితీగల అధికారి .. అవినీతి రాజకీయ నాయకుడికి మధ్య పోరు .. మధ్యలో తల్లి సెంటిమెంట్ ... తండ్రి సెంటిమెంట్ ఇది కాకుండా భారీ ఫైట్లు .. పాటలు చెట్లు లాంటి అదనపు హంగులు ఉండనున్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్.. శంకర్ దర్శకత్వం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
డాకు మహారాజ్ :
బాల‌య్య సినిమా ట్రైలర్ .. బాలయ్య మార్క్‌ ట్రైలర్ కాదు. ఇందు లో భారీ డైలాగులు .. అరుపులు లేవు. అంతా సెటిల్ గా ఉంది. అండర్ ప్లే చేసే హీరో పాత్ర ఇది. జనాలను హింసించే క్రూరమైన ఓ విలను భారీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హీరోయిన్ .. కథ చాలా పెద్దది అన్నట్టుగా కనిపిస్తోంది.
సంక్రాంతి వస్తున్నాం :
వెంకీ సినిమా ట్రైలర్ పూర్తిగా ఫన్ కొంచెం యాక్షన్ మరి కొంచెం సెంటిమెంట్ మిక్స్ చేశారు. మిగిలిన రెండు సినిమాల తో పోలిస్తే ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ట్రైలర్ లోనే కథ‌ మొత్తం చెప్పేశారు. వెంకీ మార్కు చమక్కులు ... అనిల్ రావిపూడి మార్క్ ఫ‌న్ ఉంది.


ఇలా సంక్రాంతి బ‌రి లో నిలిచిన మూడు సినిమాల ట్రైలర్లు వచ్చేసాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుంచి టిక్కెట్లు పెంపుపై అనుమతులు కూడా తెచ్చుకున్నారు. థియేటర్లు కూడా పంచుకున్నారు ... ఇక మిగిలింది మూడు సినిమాల రిజ‌ల్ట్ మాత్రమే. మ‌రి ట్రైల‌ర్ల తో స‌రి స‌మాన‌మైన అంచ‌నాల‌తో ఉన్న ఈ ముగ్గురు హీరోల్లో రేపు సినిమాలు రిలీజ్ అయ్యాక ఎవ‌రు పై చేయి తో విజేత‌గా నిలుస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: