తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఏకంగా 37 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. నైజాం ఏరియాలోనే దాదాపుగా 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలకు అమ్ముడవగా బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో ఈ మూవీ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లు సాధించడం సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే.
రోబో సినిమాకు సీక్వెల్ గా 2.0 తెరకెక్కగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. శంకర్ రోబో సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది. రోబో సినిమా విడుదలై దాదాపుగా 15 సంవత్సరాలు అయినా ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.
శంకర్ అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న దర్శకులలో ఒకరు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. శంకర్ గేమ్ ఛేంజర్ తో మరిన్ని సంచలనాలు సృష్టించడంతో పాటు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శంకర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. శంకర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.