•డైరెక్టర్ శంకర్ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే..

•ఆమె మరణమే ఈయన కెరియర్ ప్లాప్ అవ్వడానికి కారణమా..?

•గేమ్ ఛేంజర్ తో కం బ్యాక్ అవుతారా?  


తమిళ సినిమాల పైన ఆసక్తి కలిగించే డైరెక్టర్లలో మణిరత్నం తర్వాత డైరెక్టర్ శంకర్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. తెలుగు, తమిళ సినిమాలను పైకి లేపిన డైరెక్టర్స్ గా పేరుపొందారు.. 1980,90లో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు శంకర్. అయితే శంకర్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే శంకర్ సినిమాలు మిస్ ఫైర్ అవ్వడానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


1993లో జెంటిల్మెన్ చిత్రం ద్వారా డైరెక్టర్ శంకర్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత భారతీయుడు, ప్రేమికుడు, జీన్స్, బాయ్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా ఒకటికి మించి మరొకటి మంచి విజయాలను అందుకున్నారు శంకర్. ఈ చిత్రాలు తెలుగులో కూడా విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. ఈ చిత్రాలన్నిటికీ కూడా ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించడం హైలైట్ గా నిలిచింది. ప్రతి సినిమాలో కూడా శంకర్ ఏదో ఒక మెసేజ్ ప్రేక్షకులకు అందించేవారు. భారీ ఖర్చుతో కూడిన అద్భుతమైన పాటలు,  గ్రాండ్ విజువల్స్ అందరినీ కూడా ఆకట్టుకునేవి.

అయితే ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా మిస్ ఫైర్ అవుతున్నాయి. మొదటిసారి డైరెక్టర్ శంకర్ హిందీలో వచ్చిన 3D సినిమాని స్నేహితుడిగా రీమేక్ చేశారు. ఈ రీమిక్స్ సినిమానే శంకర్ కి మొదట ఫ్లాప్ తెచ్చిందట. ఆ తర్వాత విక్రమ్ తో ఐ సినిమా ప్రయోగాత్మకంగా చేసినా..  ఇది గ్రాండ్ గా కనిపించింది కానీ ఫ్లాప్ గా మిగిలిపోయింది. రోబో-2 చిత్రంతో కమర్షియల్ గా సక్సెస్ అయ్యారు శంకర్. మళ్లీ ఇండియన్-2 చిత్రంతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు.


డైరెక్టర్ శంకర్ గతంలో చేసిన సినిమాలలో మంచి డెప్త్ ఉండేది. ఎందుకంటే మొదటిది అతని సినిమాల కథలో ఒక సహజత్వం కూడా ఉండేది. ముఖ్యంగా జనాల నుంచి కథలను తీసుకొని, సమస్యలను పసిగట్టి మరీ సినిమా తీసేవారు శంకర్. అలా ఎన్నో చిత్రాలలో చూపించి,  వాటిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేసుకునేవారు. కానీ రోబో చిత్రం నుంచి ఎక్కువగా ఇలాంటివి ఎమోషనల్ గా వర్కౌట్ కాలేదట. అలాగే శంకర్ సినిమాలకు ఎక్కువగా సుజాత అనే ఒక స్టార్ రైటర్ సపోర్టుగా ఉండేవారట. అంతేకాకుండా డైలాగ్,  స్క్రీన్ ప్లే ను ఎక్కువగా సుజాతనే చూసుకునేవారట.. ఆయన 2008లో మరణించడంతో ఆ తర్వాత నుంచి శంకర్ సినిమాలకు ఎవరు కూడా డైలాగ్స్,  ఎమోషన్స్ సన్నివేశాలు సరిగ్గా పండించట్లేదని సమాచారం. సుజాత లేకపోవడం వల్లే శంకర్ ఫెయిల్యూర్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ ని కూడా సంగీతం నుంచి దూరం పెట్టినప్పటికీ ఈ మ్యాజిక్ మిస్ అవుతోందని అభిమానులు వాపోతున్నారు. మరి గేమ్ ఛేంజర్ చిత్రంతో కం బ్యాక్ ఇస్తారా ?ఇవ్వరా? అనే విషయం మరి కొద్ది రోజులలో తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: