బ్రహ్మానందం వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చాలామంది ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. హిందూ ధర్మం గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా అవగాహన లేని విషయాల గురించి మాట్లాడవద్దని హితవు పలుకుతున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి నేటి మహిళా సైన్యం వరకు, భారతీయ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారని గుర్తు చేస్తున్నారు.
ఋగ్వేదం వంటి గ్రంథాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడిందని, వేదాల్లో ఎక్కడా మహిళలను చదువుకు దూరం చేయాలని రాయలేదని స్పష్టం చేస్తున్నారు. ముస్లిం రాజులు, ఇతర విదేశీయులు విధించిన నిబంధనలను భారతదేశంపై రుద్దారని, కొన్ని గ్రంథాల్లో కాలానుగుణంగా మార్పులు చేసి మహిళలను అణచివేసే ప్రయత్నాలు జరిగాయని వివరిస్తున్నారు.
పేరు ప్రఖ్యాతలు కలిగిన బ్రహ్మానందం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందూ ధర్మంపై అనవసరంగా చెడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మానందాన్ని విమర్శించకుండా, వాస్తవాలను ఆయనకు తెలియజేస్తే, ఆయన తన అజ్ఞానాన్ని తెలుసుకుంటారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా, బ్రహ్మానందం చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనకు కొంత ప్రతికూలతను తెచ్చిపెట్టాయి. అందుకే సినిమా వాళ్ళు ఏదైనా సున్నితమైన అంశం గురించి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అది కరెక్ట్ గా నిజమని తెలిస్తేనే మాట్లాడాలి లేదంటే అజ్ఞానంతో మాట్లాడితే బ్రహ్మానందం లాగానే విమర్శల పాలయ్యే అవకాశం ఉంది. మొన్నటిదాకా ప్రకాష్ రాజు పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బ్రహ్మానందం పై టార్గెట్ చేస్తున్నారు. కానీ ఆయన తిట్టడం సమర్థనీయం కాదు.