- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ హీరోలు అయిన బాలకృష్ణ - జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్‌ ఎప్పుడూ ఏదో ఒక కొత్త కారణం వెతుక్కుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా అన్ స్టాపబుల్ షోలో జై లవకుశ సినిమా ప్రస్తావన వచ్చిందని .. అయితే దానిని ఎడిట్ చేసి లవకుశ మాట లేకుండానే ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేశారని ఓ వార్త బయటకు వచ్చింది. దాంతో జూనియ‌ర్ అభిమానులు సహజంగానే భ‌గ్గుమంటున్నారు .. డైరెక్ట‌ర్‌ బాబీ తీసిన సినిమాలలో జై లవకుశ మంచి హిట్ .. అలాంటి సినిమాని బాబి దగ్గర ప్రస్తావించకుండా మిగిలిన సినిమాల పేర్లు .. పోస్టర్లు వరుస‌ పెట్టి స్క్రీన్ పై చూపించడం ఎన్టీఆర్ అభిమానులకు ఎంత మాత్రం నచ్చలేదు. జై ల‌వ‌కుశ సినిమా ప్రస్తావన వచ్చిన దాన్ని ఎడిట్ చేశారన్న పుకార్లు బయటికి రావడంతో ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య డాకు మహారాజ్‌ సినిమాను ట్రోల్ చేయటం మొదలుపెట్టేశారు. దీంతో సహజంగానే నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


ఆ ఎపిసోడ్లో బాబి తో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు. దీనిపై నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. అసలు జై లవకుశ సినిమా ప్రస్తావని రాలేదని ... దాన్ని ఎడిట్ చేశారు అనటం ఉత్తి మాటే అని తేల్చేశారు. షాట్‌ గ్యాప్ లో ఎన్టీఆర్ గురించి ఓ మాట అన్నారని ... ఓ సినిమాలో ఎన్టీఆర్సినిమా చేసి ఉంటే బాగుండేదని బాలయ్య అభిప్రాయపడ్డారని నాగ వంశీ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యే అవకాశం ఉంది. అసలు నిజాలు తెలుసుకోవాలంటూ బాలయ్య ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా నందమూరి ఫ్యామిలీలో .. బాలయ్య - ఎన్టీఆర్ అభిమానులు ఇకనైనా అనవసర చర్చిలకు పుల్ స్టాప్ పెడుతూ అందరూ కలిసిమెలిసి నందమూరి అభిమానులుగా ఒక్కటిగా ఉంటే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: