ఈ సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు మూడు సినిమాలు ప్రమోషన్లు జోరు అందుకున్నాయి. మూడు సినిమాల ట్రైలర్ లు వచ్చేసాయి. ఇప్పుడు ఏది బెస్ట్ అనే చర్చ నడుస్తోంది. ట్రైలర్ రీచ్ ని బట్టి సినిమా అంచనా వేస్తారు. కాబట్టి ఈ మూడు ట్రైలర్ల గురించి ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మూడు సినిమాల్లో ముందుగా వస్తుంది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.
గేమ్ ఛేంజర్ :
ముందుగా బయటకు వచ్చిన ట్రైలర్ కూడా ఇదే. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఇది. ట్రైలర్లు విజువల్స్ బాగున్నాయి. చరణ్ లుక్ అదిరింది.. కొన్ని షాట్లు నిజంగా వెండితెరపై చూస్తే విజిల్స్ వేసేలా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడుతున్నాయి. గేమ్ ఛేంజర్ పై వాస్తవానికి కాస్త తక్కువ నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలకు మించి ట్రైలర్ రావడంతో అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.
డాకూ మహారాజ్ :
ఇక డాకూ మహారాజు సంక్రాంతి సినిమాలలో గ్యారెంటీ హీట్ అనే ఇమేజ్ తెచ్చుకుంది. టీజర్ తో అభిమానులు అంచనాలు ఆకాశానికి వెళ్ళిపోయాయి. ట్రైలర్ రిలీజ్ అయింది. బాలయ్య పాత్ర బాగుంది ..స్టైలిష్ గా కట్ చేసిన ట్రైలర్ ఇది. సాధారణంగా బాలకృష్ణ ట్రైలర్ అంటేనే పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి .ఈసారి ట్రైలర్లో అవి లేవు. బాలయ్య నుంచి గుర్తుపెట్టుకునే డైలాగులు రాలేదు అన్న కంప్లైంట్ లు ఉన్నాయి. ట్రైలర్ డాకు సినిమాపై ఉన్న అంచనాలు పెంచలేదు.. అలాగని తగ్గించడం లేదు.
సంక్రాంతికి వస్తున్నాం :
సంక్రాంతి బరిలో ఉన్న మరో సినిమా విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావి పూడి - వెంకటేష్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ట్రైలర్ లో ఉన్నాయి.. వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీ బాగుంది. ఈ సంక్రాంతి ఫ్యామిలీతో పాటు మా థియేటర్లకు రావచ్చు అనే నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగించింది. ఇప్పటికే బీమ్స్ అందించిన పాటలు సూపర్ హిట్ పాటలతో పాటు ట్రైలర్ కూడా సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెంచేసింది. అది ఈ మూడు సినిమాల ట్రైలర్ రివ్యూలు.