అంతేకాదు ఇప్పటిదాకా 1831 కోట్లు క్రాస్ చేసి బాహుబలి 2 రికార్డ్స్ కూడా దాటేసి ఇండియన్ హిస్టరీ లోనే నెంబర్ వన్ సినిమాగా పుష్ప2 తన రూలింగ్ స్టార్ట్ చేసింది . కాగా సినిమా రిలీజ్ అయిపోయి నెల రోజులు దాటిపోయింది .పండక్కు 'గేమ్ చేంజెఋ.. అదేవిధంగా 'డాకు మహారాజ్' ..అదేవిధంగా 'సంక్రాంతికి వస్తున్నాం'.. సినిమాలు క్యూ కట్టాయి. సో తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ పై ఇక పెద్దగా ఆశపెట్టుకోలేము. అయితే బాలీవుడ్ లో మాత్రం పుష్ప2 ఊపి పూర్తిగా తగ్గలేదు .. ఇంకా కూడా అక్కడ సినిమా థియేటర్స్ లో జనాలు మూవీ చూడటానికి ఇష్టపడుతున్నారు.
అయితే హిందీలో పుష్ప2 సినిమాని ఢీకొట్టే రేంజ్ లో ఏ సినిమా రిలీజ్ కాకపోవడమే అందుకు కారణం అంటూ కూడా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ సినిమాలోని మరికొన్ని సీన్స్ ని యాడ్ చేసి అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ ని జోడించి.. జనవరి 11వ తేదీ నుంచి థియేటర్లో ప్రదర్శించబోతున్నారట . ఈ మేరకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది . అయితే సరిగ్గా పండగ టైంలోనే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇది బిజినెస్ కోణంలో ఆలోచిస్తున్నారు జనాలు . సినిమా ఎక్కువ కోట్లు కలెక్ట్ చేయాలి అంటే ఈ విధంగానే చేయాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . మరికొందరు మాత్రం అంతా అయిపోయాక మళ్ళీ ఏమి చూడాలి..? అదనపు 20 నిమిషాలు ఆడ్ చేస్తే మళ్లీ ఆ 20 నిమిషాల కోసం జనాలు డబ్బులు ఖర్చు చేసుకొని తియేటర్ కి వెళ్లాలా ..? ఇదేం చెత్త ఐడియా అని కూసింత ఘాటుగానే ట్రోల్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఎవడ్రా అసలు ఈ తల తిక్క ఐడియా ఇచ్చిన వెధవ అంటూ కూడా కొంతమంది ఘాటుగా స్పందిస్తున్నారు..!