- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


ఈసారి టాలీవుడ్ లో సంక్రాంతికి సినీ రంగంలో పెద్దగా గందర గోళం లేదు. మరీ ముఖ్యంగా థియేటర్లు కూడా కనిపించడం లేదు. గతంలో చాలా సందర్భాలలో మూడు అంతకుమించి సినిమాలు రిలీజ్ అయ్యేవి. వీటికితోటి డబ్బింగ్ సినిమాలు పోటీ ఉండేది .. థియేటర్లో సర్దుబాటు విషయంలో గజిబిజి జరిగేది. పైగా ఈసారి మూడో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాల గోల లేదు. రిలీజ్ అవుతున్న మూడు సినిమాలలో రెండు సినిమాలు దిల్ రాజు నిర్మాతగా చేసినవే.. మూడో సినిమాని కూడా చాలా ఏరియాలలో ఆయనే స్వయంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో గందరగోళానికి .. వివాదానికి పెద్దగా ఆస్కారం లేదు. ఈ మూడు సినిమాలలో ఏది ఎలా ఉంటుందో ? అన్న సందేహాలు మొన్నటివరకు ఉండేవి. ఇప్పుడు మూడు సినిమాలు ట్రయిలర్లు బయటకు వచ్చాక మూడు ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి.


మూడు సక్సెస్ అయిన ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది. సంక్రాంతికి రానున్న మూడు సినిమాలు రెండు రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. ముందుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్‌ వచ్చింది. అంతకు ముందు దాకా ఈ సినిమా మీద కొన్ని సందేహాలు ఉన్నాయి .. అనుకున్నంత బజ్ లేదు. ట్రైలర్ ఆకర్షణీయంగా ఉండడంతో ఆటోమేటిక్గా సినిమాపై హైప్ పెరిగింది. ఇక డాకు మహారాజు సినిమాకు కూడా ముందు నుంచి మంచి హైప్‌ ఉంది. ట్రైలర్ మాస్క్ ఫుల్ మీల్స్ గ్యారెంటీ అనే సంకేతాలు ఇచ్చేసింది. జనవరి 10న రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అయితే .. రెండు రోజుల గ్యాప్లో జనవరి 12న బాలయ్య డాకు మహారాజ్ గా థియేటర్లలోకి రానున్నాడు. వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ త‌ర్వాత‌ దర్శకుడు బాబి తెర‌కెక్కించిన సినిమా ఇది.


ఇక సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా కూడా కంప్లీట్ వెంకీ - అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో రానుంది. డాకూ మ‌హారాజ్ వ‌చ్చిన రెండు రోజుల‌కు రిలీజ్ అవుతోంది. జ‌న‌వ‌రి 14న ఈ సినిమా వ‌స్తోంది. ఏదేమైనా ఈ మూడు సినిమాలు కూడా మంచి హైప్‌తో ఈ సంక్రాంతికి కావాల్సినంత ఎంట‌ర్టైన్ మెంట్ ఇచ్చేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: