మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఆ బాలీవుడ్ హీరోయిన్ నిజంగానే తిట్టిందా.. ఇంతకీ అంత పెద్ద హీరోని తిట్టవలసిన అవసరం ఆ హీరోయిన్ కి ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. రామ్ చరణ్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది జంజీర్..బాలీవుడ్ జంజీర్ మూవీ తెలుగులో తుఫాన్ మూవీ.. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ అయింది.అయితే ఈ సినిమాని మొదట ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట రామ్ చరణ్. కానీ ఈ సినిమాలో నటించాకే తనకి తప్పు చేశాను అనే భావన కలిగిందట.నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అని కూడా రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఓ షోలో చెప్పారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్.. అయితే ఈ సినిమాని తెలుగులో తుఫాన్ పేరుతో రీమేక్ చేశారు. 

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించింది. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే రాంచరణ్ కెరియర్ కి ఈ సినిమా పెద్ద మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు.  అపూర్వ లకియా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కానీ సినిమా అనుకున్న ఫలితాలను అయితే అందుకోలేదు. ఇక ఈ సినిమాలో నటించి ఇప్పటికీ బాధపడుతున్నాను.. నా జీవితంలో చేసిన తప్పు అదే అంటూ రీసెంట్గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో గేమ్ ఛేజర్ ప్రమోషన్స్ కోసం పాల్గొన్న సమయంలో రాంచరణ్ బయట పెట్టారు.అయితే ఈ సినిమా సమయంలో రాంచరణ్ పై ఎన్నో రూమర్లు వినిపించాయి.

అంతేకాదు సినిమాలో నటించిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా రామ్ చరణ్ పై పరోక్ష విమర్శలు చేసింది. రాంచరణ్ వల్ల నా వేరే సినిమాలకు ఇబ్బంది కలిగింది. ఆయన షూటింగ్ సెట్ కి కరెక్ట్ గా రారు. ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా కరెక్ట్ గా రారు. ఆయన వల్ల నా వేరే సినిమా షూటింగ్స్ లేట్ అయ్యాయి. తుఫాన్ లో నా సీన్స్ తొందరగా అయిపోయేవి. కానీ రామ్ చరణ్ చేసిన ఆలస్యం వల్లే ఈ సినిమా కోసం ఎక్కువ టైం కేటాయించాను అంటూ ప్రియాంక చోప్రా రామ్ చరణ్ పై పరోక్షంగా అసహనం వ్యక్తం చేసింది.అయితే ఎవరి నోటితో తిట్టించుకున్నాడో మళ్ళీ ఆమె నోటితోనే పొగించుకున్నాడు రామ్ చరణ్. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటన చూసి ప్రియాంక చోప్రా రామ్ చరణ్ తెగ పొగిడేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: