గుంటూరు కారం సినిమాలోని ఆ కుర్చీని మడత పెట్టి అనే పాట గత ఏడాది పెద్ద సెన్సేషన్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ కుర్చీ మడత పెట్టే అనే సాంగ్ వచ్చింది ఒక తాత కారణంగా.. యూట్యూబ్లో ఒక తాత ఒకే ఒక్క డైలాగ్ తో చాలా ఫేమస్ అయ్యారు. ఆ కుర్చీని మడత పెట్టి అనే డైలాగ్ తో కుర్చీ తాతగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయారు. ఇక అప్పట్లో కూర్చి తాత పేరు చాలా వైరల్ అయింది.ఏ సినిమా విడుదలైన ఆ తాత ఆ సినిమాలకు రివ్యూ ఇస్తూ స్టార్ హీరో హీరోయిన్లపై కూడా షాకింగ్ కామెంట్లు చేశారు.అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ తాజాగా మళ్ళి కుర్చీ తాత పేరు తెర మీదికి వచ్చింది. రామ్ చరణ్ సినిమాని విమర్శిస్తూ బాలకృష్ణ సినిమాని మెచ్చుకున్నారు.

 కుర్చీ తాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అందరూ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నారు.. గేమ్ ఛేంజర్ అంటే వాడేమైనా ఆకాశము నుండి ఊడిపడ్డాడా.. బాలయ్య సినిమా ముందు రాంచరణ్ ఎంత.. బాలయ్య బాబు డైలాగ్ కొడితే అందరికీ ఉచ్చ పడుద్ది.. బాలకృష్ణ ముందు రామ్ చరణ్ సినిమా బొచ్చు కూడా పీకలేడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక కుర్చీ తాత మీసాలు మేలేసుకుంటూ తనదైన స్టైల్ లో డైలాగులు చెప్పడం సినిమాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 ఇక గత ఏడాది సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన కుర్చీ తాత ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపించకపోయినప్పటికీ బాలకృష్ణ రామ్ చరణ్ ల గురించి మాట్లాడి మళ్లీ ఫేమస్ అయిపోయారు. ఇక కుర్చీ తాత మాటల పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా చూశాక తేల్చుకుందాం ఎవరు ఎవరీ బొచ్చు పీకలేరో అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: