అంతేకాకుండా పోస్టర్లతో సినిమాలలోని పాత్రలను కూడా రివిల్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం. వీటన్నిటికీ కూడా స్పందన భారీగానే వస్తోంది. తాజాగా ఇటీవలే కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా ఫస్ట్ లుక్ ని మేకర్ విడుదల చేయగా.. ఇందులో ముల్లోకాలు ఏలే తల్లి.. భక్తులని ఆదుకొనే త్రిశక్తి అంటూ ఒక కొటేషన్ తో కాజల్ పాత్రను రివిల్ చేయడం జరిగింది. ఈ పోస్టర్లో కాజల్ అగర్వాల్ తెల్లటి చీరలో హిమాలయాల పర్వతాలు అడుగున ఒక బండ రాయి మీద కూర్చున్నట్టుగా చూపించారు.
అయితే కాజల్ అగర్వాల్ వెనకాల ఒక మహాకాళి అవతారంతో పొగమంచులో డిజైన్ చేయడం జరిగింది. పోస్టర్ బాగానే ఉన్న హిందూ ధర్మాలను తప్పుగా చూపించారు అంటూ కొంతమంది హిందూ సంఘాలు ఈ పోస్టర్ పైన ఫైర్ అవుతున్నారు. కాజల్ అగర్వాల్ ఈ పోస్టర్లో మోడరన్ లుక్ లో కనిపిస్తోందంటూ రోల్ చేస్తున్నారు. కొంతమంది అసలు కాజల్ అగర్వాల్ దేవత మూర్తిగా కనిపించలేదంటూ విమర్శించడమే కాకుండా నుదుటిన బొట్టు, చేతికి పారాణి ఎక్కడ అంటూ చాలామంది ట్రోల్ చేయడం జరుగుతోంది. ఇది ఏఐ జనరేటర్ పోస్టర్లా ఉందంటూ చాలామంది హిందువులు తప్పు పడుతున్నారు. కన్నప్ప టీమ్ ని వెంటనే ఈ పోస్టర్ డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి వీటి పైన కన్నప్ప టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.