కొడుకు గ్రాండ్ గా టాలీవుడ్ కి పరిచయం చేద్దాం అనుకున్న బాలకృష్ణ.. స్టార్ట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను చూస్ చేసుకోవడం కొంతమంది నందమూరి ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు . బోయపాటి శ్రీను .. లేదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ..లేదంటే మరొక స్టార్ డైరెక్టర్ కి ఆ ఛాన్స్ ఇస్తాడు అని ఆశపడ్డారు . సీనీయర్స్ కి ఆ డెబ్యూ వాల్యూ తెలుస్తుంది అంటూ కూడా కామెంట్స్ పెట్టారు. అయితే బాలకృష్ణ ప్రశాంత్ వర్మను నమ్మి పూర్తిగా ఆయన పైన బాధ్యతలు పెట్టేసాడు. మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా వస్తుంది అంటూ అఫీషియల్ ప్రకటన కూడా చేసేశారు .
అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా పై ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు వస్తున్నాయి . కొంతమంది నందమూరి ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమా వద్దు సార్ అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు . నందమూరి మోక్షజ్ఞ సినిమా అంటే పక్క మాస్ కమర్షియల్ గా ఉండాలి.. అలాంటి డైరెక్టర్ తోనే లాంచ్ చేయాలి. ప్రశాంత్ వర్మ లాంటి డీసెంట్ డైరెక్టర్ నుంచి మాస్ ఎలిమెంట్స్ అసలు ఊహించలేం . అందుకే ప్రశాంత్ వర్మతో సినిమాలు పక్కన పెట్టేసి అంతకంటే ముందే మోక్షజ్ఞను వేరే మాస్ డైరెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది సార్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
అయితే ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఇది కేవలం ఫ్యాన్స్ ఆలోచన మాత్రమే కాదు . నందమూరి కుటుంబ సభ్యుల ఆలోచన కూడా అంటూ బయటపడింది . నందమూరి కాంపౌండ్ కు చెందిన కొంతమంది వ్యక్తులు ఇన్నర్ ఫీలింగ్ కూడా ఈ విధంగానే ఉందట . మోక్షజ్ఞ అంటే ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఎంట్రీ ఇవ్వాలి .. ఇలా సింపుల్ సబ్జెక్టుతో వస్తే ఎలా ..? అంటూ ప్రశాంత్ వర్మను వెనక్కి నెట్టే ఆలోచనలు చేస్తున్నారట. దీంతో ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఏ డైరెక్టర్ తో అన్న క్వశ్చన్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!